3.44 PM :సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 759 పాయింట్లు లాభపడి 73,327 వద్ద రికార్డు స్థాయిలో ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 202 పాయింట్లు వృద్ధిచెంది 22,097 వద్ద జీవన కాల గరిష్ఠాలతో స్థిరపడింది. ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ కొనసాగడమే ఇందుకు కారణం.
ఈ రోజు కమోడిటీస్, మెటల్ స్టాక్స్ మాత్రం నష్టాలను చవిచూశాయి. అయితే ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ సహా, ఆయిల్ & గ్యాస్, ఎనర్జీ షేర్స్ ఇవాళ మంచి లాభాలను మాటగట్టుకున్నాయి. దీనితో స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాలను నమోదు చేశాయి.
లాభపడిన స్టాక్స్ :విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్
నష్టపోయిన షేర్స్ :బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సెర్వ్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్, నెస్లే ఇండియా
ఆసియా మార్కెట్లు
Asian Markets Today :ఆసియా మార్కెట్లైన సియోల్, టోక్యో, షాంఘైలు ఇవాళ లాభాలతో ముగిశాయి. హాంకాంగ్ మాత్రం నష్టాలను చవిచూసింది.
ముడి చమురు ధరలు
Crude Oil Prices Today : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.29 శాతం మేర క్షీణించాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 78.06 డాలర్లుగా ఉంది.
Stock Market Today January 15th 2024 :సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ మొదటి సారిగా 73,000 లెవెల్‌ను దాటి జీవన కాల గరిష్ఠాలను నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ మరోసారి 22,000 లెవెల్‌ను క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం సహా, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ కొనసాగుతుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 635 పాయింట్లు లాభపడి 73,203 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 156 పాయింట్ల వృద్ధిచెంది 22,050 వద్ద కొనసాగుతోంది.