తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 950 పాయింట్లు పతనం - ఈరోజు సెన్సెక్స్

stock market
స్టాక్ మార్కెట్ లైవ్ అప్​డేట్స్​

By

Published : Aug 29, 2022, 9:39 AM IST

Updated : Aug 29, 2022, 9:53 AM IST

09:34 August 29

స్టాక్ మార్కెట్ లైవ్ అప్​డేట్స్​

Stock market today India : అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో భారతీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 950 పాయింట్లు తగ్గి 57వేల 875 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 290 పాయింట్లు క్షీణించి 17వేల 270 వద్ద కొనసాగుతోంది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్​పర్సన్ జెరోమీ పావెల్ చేసిన ప్రసంగం భారతీయ స్టాక్​ మార్కెట్లు భారీగా నష్టపోయేందుకు కారణమైంది. అగ్రరాజ్యంలో అంతకంతకూ ఎగబాకుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లు పెంచక తప్పదని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దేశీయ మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు.

Last Updated : Aug 29, 2022, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details