Stock Market Close :శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్@71,605 వద్ద; నిఫ్టీ@21,492 వద్ద ఆల్‌టైమ్ హై రికార్డ్‌ను నమోదు చేశాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, విదేశీ పెట్టుబడులు పెరగడం సహా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి అంచనాలను పెంచడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 969 పాయింట్లు లాభపడి 71,483 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 273 పాయింట్లు వృద్ధి చెంది 21,456 వద్ద ముగిసింది.
లాభపడిన స్టాక్స్ : హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, విప్రో, పవర్‌గ్రిడ్, ఏసియన్ పెయింట్స్
నష్టపోయిన షేర్స్ :నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి, ఐటీసీ, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్
ఐటీ సెక్టార్ లాభాల పంట
శుక్రవారం ఐటీ, టెక్, మెటల్ షేర్లు భారీగా లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఏకంగా 5.58 శాతం మేర లాభపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా కూడా మంచి లాభాలు గడించాయి.
పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతదేశానికి తమ పెట్టుబడులను మళ్లిస్తూనే ఉన్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత మదుపరులు గురువారం రోజు ఏకంగా రూ.3,570 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు కొనుగోలు చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లు
శుక్రవారం ఆసియా మార్కెట్లైన సియోల్, టోక్యో, హాంకాంగ్ మంచి లాభాలతో ముగిశాయి. షాంఘై మాత్రం నష్టాలతో ముగిసింది. యూరోపియన్ మార్కెట్లు ప్రస్తుతానికి మిక్స్డ్ ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.33 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 76.86 డాలర్లుగా ఉంది.
- 3.25 PM
Stock Market Update :బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 1064 పాయింట్లు లాభపడి 71,605 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 302 పాయింట్లు వృద్ధి చెంది 21,492 వద్ద కొనసాగుతోంది. - 3.04 PM
Stock Market Update :బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 870 పాయింట్లు లాభపడి 71,442 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 247 పాయింట్లు వృద్ధి చెంది 21,451 వద్ద కొనసాగుతోంది. - 2:32 PM
Stock Market Update :బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 531 పాయింట్లు లాభపడి 71,171 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 165 పాయింట్లు వృద్ధి చెంది 21,365 వద్ద కొనసాగుతోంది. - 9:30 AM
Stock Market Today 15th December 2023 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 71,021 లెవెల్ వద్ద; నిఫ్టీ 21,335 వద్ద ఆల్ టైమ్ హై రికార్డ్లను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం సహా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు కూడా ఇందుకు కారణం.