Stock Market news: భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు కుదేలవడం నష్టాలకు ప్రధాన కారణం. స్టాక్ మార్కెట్లు బుధవారం సాగిన తీరుపై మరిన్ని వివరాలు...
- బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 566 పాయింట్లు కోల్పోయి 59,610 వద్ద స్థిరపడింది.
- జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 150 పాయింట్లు క్షీణించి 17,808 వద్ద ముగిసింది.
- హెచ్డీఎఫ్సీ ట్విన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
- ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి.
- అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించడం, వడ్డీ రేట్లు పెంపు ఖాయమనేలా ఫెడరల్ రిజర్వ్ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం.
- లండన్, ఫ్రాంక్ఫర్ట్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. టోక్యో, హాంగ్కాంగ్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. షాంఘై సూచీ ఫ్లాట్గా ట్రేడయింది.
- ముడి చమురు ధర బ్యారెల్కు డాలరుపైగా పెరిగి 103.15 డాలర్లకు చేరింది.