తెలంగాణ

telangana

ETV Bharat / business

దూసుకెళ్లిన సూచీలు​.. సెన్సెక్స్​ 690 ప్లస్ - national stock exchange updates

STOCK MARKET LIVE UPDATES
STOCK MARKET LIVE UPDATES

By

Published : Oct 14, 2022, 9:45 AM IST

Updated : Oct 14, 2022, 4:07 PM IST

16:05 October 14

Stock Market Close: ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్​ మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. ఐటీ, బ్యాంక్​ రంగాల షేర్లు జోరు కొనసాగించడం వల్ల శుక్రవారం సెషన్​ను లాభాలతో ముగించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ 684 పాయింట్లు లాభపడి 57,919 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ సైతం 171 పాయింట్లు పెరిగి 17,185 వద్ద ట్రేడింగ్​ను ముగించింది.

09:36 October 14

స్టాక్​ మార్కెట్లలో ఫుల్​ జోష్​

Stock Market Live Updates: బలమైన అంతర్జాతీయ సంకేతాలు, చమురు ధరలు దిగొస్తున్న నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గురువారం అనూహ్యంగా పుంజుకున్నాయి. అక్కడ సెప్టెంబరు రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలకు మించి 8.2 శాతంగా నమోదైనప్పటికీ.. మార్కెట్లు రాణించడం విశేషం. మరోవైపు మాంద్యం భయాలు, అమెరికా రిజర్వుల్లో భారీ నిల్వల నేపథ్యంలో చమురు ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ బ్యారెల్‌ ధర 0.13 శాతం తగ్గి 94.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

బొంబాయి స్టాక్​ ఎక్చేంజ్ సూచీ​ సెన్సెక్స్‌ 910 పాయింట్ల లాభంతో 58,145 వద్ద ట్రేడవుతోంది. ఈ సూచీ ఓ దశలో 1,000 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 245 పాయింట్లు లాభపడి 17,261 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి.

Last Updated : Oct 14, 2022, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details