భారీ నష్టాల నుంచి కోలుకొని..దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో ఫ్లాట్‌గా ముగిశాయి. ఓ దశలో భారీ నష్టాల్లో కదలాడిన సెన్సెక్స్, నిఫ్టీ చివరకు కోలుకున్నాయి. ఇంట్రాడేలో దాదాపు 1000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ ఆఖర్లో.. మళ్లీ పాజిటివ్‌లోకి వచ్చి చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 111 పాయింట్లు కోల్పోయి.. 52 వేల 908 వద్ద సెషన్‌ను ముగించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 15 వేల 752 వద్ద స్థిరపడింది. ఎఫ్ఎంసీజీ, రియాల్టీ రంగం షేర్లు వృద్ధి చెందాయి. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు పతనమయ్యాయి.
ఐటీసీ, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, సిప్లా, బ్రిటానియా షేర్లు అధికంగా లాభపడ్డాయి. ఓఎన్జీసీ, రిలయన్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్ టెల్ ఎక్కువగా నష్టపోయాయి. ఓఎన్జీసీ 13 శాతం, రిలయన్స్ 7 శాతానికిపైగా పడిపోవడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ట్యాక్స్‌ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ షేర్లు నష్టపోయాయి.