తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు భారీ నష్టాలు.. సెన్సెక్స్​ 700 పాయింట్లు డౌన్ - స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​

Stock Market Live Updates
Stock Market Live Updates

By

Published : Jun 22, 2022, 9:46 AM IST

Updated : Jun 22, 2022, 3:43 PM IST

15:31 June 22

స్టాక్​ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 709 పాయింట్లు కోల్పోయి 51,822 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225 పాయింట్లు పతనమై 15,413కి పడిపోయింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులున్నప్పటికీ ఆసియా మార్కెట్ల ప్రతికూలతలు సూచీలను ప్రభావితం చేశాయి. మదుపర్లు మంగళవారం కొనుగోళ్లపై ఆసక్తి కనబర్చగా.. బుధవారం అమ్మకాలకు మొగ్గు చూపారు.

బీపీసీఎల్​, హీరో మోటోకార్ప్​, టీసీఎస్​, మారుతీ సుజుకీ, పవర్​గ్రిడ్ కార్పొరేషన్​ షేర్లు లాభాలను ఆర్జించాయి.
హిందాల్కో, యూపీఎల్​, టాటా స్టీల్, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, విప్రో షేర్లు నష్టాలను చవిచూశాయి.

09:38 June 22

మార్కెట్లకు భారీ నష్టాలు.. సెన్సెక్స్​ 700 పాయింట్లు డౌన్

Stock Market Live Updates: గత సెషన్​లో భారీ లాభాలు నమోదుచేసిన దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు మళ్లీ భారీగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 570 పాయింట్లకుపైగా కోల్పోయి.. 51 వేల 950 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 180 పాయింట్లకుపైగా నష్టంతో.. 15 వేల 450 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో మారుతీ మినహా అన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్​ ఆటో కూడా రాణిస్తోంది. హిందాల్కో, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, యూపీఎల్​, టాటా స్టీల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ 3 శాతానికిపైగా పడిపోయాయి. మంగళవారం సెషన్​లో సెన్సెక్స్​ 934, నిఫ్టీ 289 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఒక్కరోజులోనే మళ్లీ నష్టాల బాట పట్టాయి దేశీయ సూచీలు.

అమెరికా, ఐరోపా మార్కెట్లు మంగళవారం లాభాలతోనే ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు మాత్రం నేడు మిశ్రమంగా చలిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే జపాన్‌ కరెన్సీ యెన్‌ విలువ 24 ఏళ్ల కనిష్ఠానికి చేరడం ఆసియా మార్కెట్లను కలవరపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్నప్పటికీ.. జపాన్‌ మాత్రం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు మరిన్ని వడ్డీరేట్ల పెంపులు, రష్యా గ్యాస్‌ను ఐరోపా దేశాలు నిలువరించనున్నాయన్న వార్తలు మార్కెట్లను కలవరపరుస్తున్న అంశాలు.

Last Updated : Jun 22, 2022, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details