తెలంగాణ

telangana

ETV Bharat / business

దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు- రిలయన్స్ నయా రికార్డ్ - రిలయన్స్​ ఇండస్ట్రీస్ షేర్లు

stock market live
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్​

By

Published : Apr 28, 2022, 2:37 PM IST

Updated : Apr 28, 2022, 6:35 PM IST

15:36 April 28

Stock Market Closing: స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత సెషన్​లో నష్టపోయిన దేశీయ సూచీలు.. గురువారం లాభాల బాటపట్టాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 701 పాయింట్లు పెరిగి.. 57 వేల 521 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 206 పాయింట్లు లాభపడి 17 వేల 245 వద్ద సెషన్​ను ముగించింది.

  • 57,296 పాయింట్లతో ప్రారంభమైన సెన్సెక్స్​ ఓ దశలో 56,936 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది. ఈ సెషన్​లో గరిష్ఠంగా 57,790 పాయింట్లకు సెన్సెక్స్​ చేరుకుంది.
  • 17189 పాయింట్లతో ప్రారంభమైన నిఫ్టీ.. 17,071 పాయింట్ల కనిష్ఠాన్ని, 17,311 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
  • ఫార్మా, పవర్​, ఆటో, ఆయిల్ ​& గ్యాస్​​ షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి చూపగా.. ఐటీ, మెటల్​, రియల్​ఎస్టేట్​ షేర్లను మదుపర్లు విక్రయించారు.
  • హిందుస్థాన్​ యూనిలివర్, ఏసియన్​ పేయింట్, పవర్​గ్రిడ్, హెచ్​డీఎఫ్​సీ లైఫ్, యూపీఎల్ షేర్లు లాభాలు నమోదు చేశాయి.
  • బజాజ్​ ఆటో, హిందాల్​కో, భారతీ ఎయిర్​టెల్​, మహీంద్రా అండ్​ మహీంద్రా, అదానీ పోర్ట్స్​ షేర్లు నష్టాలు చవిచూశాయి.

Reliance Industries MCAP: బుధవారం సెషన్​లో మార్కెట్​ క్యాపిటలైజేషన్ ​(ఎంక్యాప్​)​ విలువ రూ. 19 లక్షల కోట్ల మార్కును తాకిన రిలయన్స్​ ఇండస్ట్రీస్​ గురువారం ఆ స్థానాన్ని స్థిరపరుచుకుంది. దీంతో ఈ స్థాయి మార్కెట్​ విలువను చేరుకున్న తొలి భారత కంపెనీగా రిలయన్స్​ ఇండస్ట్రీస్​ నిలిచింది. గురువారం సెషన్​ ముగిసే సమయానికి ఎంక్యాప్​ విలువ రూ.19,07,176.65 కోట్లకు చేరుకుంది. ఓ దశలో కంపెనీ షేర్లు 2.59 శాతం మేర పెరిగి రూ.2,850 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. మార్కెట్లు ముగిసే సమయానికి షేరు విలువ రూ.2,819.20 వద్ద స్థిరపడింది. అంతకుముందు.. బుధవారం సెషన్​లో కూడా రిలయన్స్​ కంపెనీ షేర్లు స్టాక్​ మార్కెట్లలో మంచి లాభాలతో ట్రేడయ్యాయి. అదే సమయంలో మార్కెట్​ విలువ రూ. 19 లక్షల కోట్ల మార్కును అధిగమించి.. రూ. 19.12 లక్షల కోట్లకు చేరింది.

14:31 April 28

స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్​

Stock market live: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్ల లాభంతో 57 వేల 700 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 250 పాయింట్ల వృద్ధితో 17 వేల 295 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Apr 28, 2022, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details