అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలకు తోడు ఐటీ, ఎంఎఫ్సీజీ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ సుమారు 2 శాతానికిపైగా నష్టపోయాయి. ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్ 617 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 17వేల దిగువకు చేరుకుంది.
- బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 617 పాయింట్ల నష్టంతో 56,580 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో.. 56,758 వద్ద ప్రారంభమైన సూచీ అమ్మకాల ఒత్తిడితో ఓ దశలో 56,357 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత 56,876 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి.. చివరకు 56,580 వద్ద స్థిరపడింది.
- జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ 218 పాయింట్ల కోల్పోయి16,954 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో.. 17,009 వద్ద ప్రారంభమైన సూచీ ఓ దశలో 16,889 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. ఆ తర్వాత కోలుకున్న సూచీ 17,054 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి చివర్లో అమ్మకాల ఒత్తిడితో 16,954 వద్ద ముగిసింది.