Stock Market Close: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో లాభాలు నమోదుచేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 57 వేల 944 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 17 వేల 325 వద్ద సెషన్‌ను ముగించింది. నేటి సెషన్లో సూచీలు మొత్తం లాభాల్లోనే కదలాడాయి. తొలుత సెన్సెక్స్ దాదాపు 220 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత కాస్త ఒడుదొడుకులకు లోనైనా సానుకూలంగానే ట్రేడయింది. ఓ దశలో దాదాపు 400 పాయింట్లకుపైగా పెరిగి 58,002 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. 57 వేల 639 వద్ద కనిష్ఠాన్ని తాకింది.
స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 58 వేల మార్కుకు చేరువలో సెన్సెక్స్ - స్టాక్ మార్కెట్లు
stock market live updates
15:42 March 29
09:07 March 29
stock market live updates
స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులతో సెన్సెక్స్ 221 పాయింట్లు వృద్ధి చెంది 57,815కి చేరింది. నిఫ్టీ 75 పాయింట్లు మెరుగుపడి 17,297 వద్ద ట్రేడవుతోంది. భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యూపీఎల్, నెస్లీ, డా.రెడ్డీస్ ల్యాబ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Last Updated : Mar 29, 2022, 3:43 PM IST