Stock Market Close: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడయ్యాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరకు లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 231 పాయింట్లు పెరిగి 57 వేల 593 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 17 వేల 222 వద్ద సెషన్‌ను ముగించింది. ఆటో, బ్యాంకింగ్, లోహం, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు రాణించాయి. ఐటీ, ఫార్మా రంగం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత విమానాల రాకపోకలు ప్రారంభమవ్వడం, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్బీఐ ప్రకటన, రష్యా- ఉక్రెయిన్ మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశం నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా ట్రేడయినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఆటో, బ్యాంకింగ్ రంగాల ఊతం.. స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్ - నిఫ్టీ
16:01 March 28
08:56 March 28
Stock Market Live Updates
Stock Market News: స్టాక్‌మార్కెట్లు ఈ వారం తొలి సెషన్‌ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, దేశంలో చమురు ధరల పెరుగుదల వంటి కారణాలతో సెన్సెక్స్ 149 పాయింట్ల నష్టంతో 57,213 వద్ద ఉంది. నిఫ్టీ కూడా 33 పాయింట్లు కోల్పోయి 17,120 వద్ద ట్రేడ్ అవుతోంది. సిప్లా, మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్ర, డా.రెడ్డీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.