తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్​ మార్కెట్ల నయా రికార్డ్.. తొలిసారి 67వేలు దాటిన సెన్సెక్స్​ - నష్టాలతో ముగిసిన కంపెనీలు

Stock Market Closing : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డు సృష్టించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 302 పాయింట్లు లాభపడి.. 67,097 వద్ద ముగిసింది. సెన్సెక్స్​ 67వేల మార్కుకు ఎగువన స్థిరపడడం చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 83.90 పాయింట్లు ఎగబాకి.. 19,833 వద్ద ముగిసింది.

STOCK MARKET CLOSED TODAY CLOSE NEWS
సరికొత్త రికార్డులతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు.. తొలిసారి 67 వేలు దాటిన సెన్సెక్స్

By

Published : Jul 19, 2023, 3:54 PM IST

Updated : Jul 19, 2023, 4:45 PM IST

Stock Market Closing Today : సూచీల రికార్డుల పరుగు వరుసగా ఐదో రోజూ కొనసాగింది. విదేశీ నిధుల ప్రవాహానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డును నమోదు చేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 302 పాయింట్లు లాభపడి.. 67,097 వద్ద ముగిసింది. సెన్సెక్స్​ 67వేల మార్కుకు ఎగువన స్థిరపడడం చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 83.90 పాయింట్లు ఎగబాకి.. 19,833 వద్ద ముగిసింది. మొత్తంగా రెండు సూచీలు గరిష్ఠ స్థాయులలో ముగిశాయి.

ఈ కంపెనీల ఎఫెక్ట్​..
బుధవారం సెషన్‌లో బడా కంపెనీలన్నీ మెరుగైన పనితీరు కనబరచగా.. మిడ్‌క్యాప్ ఇండెక్స్​లోని కంపెనీలు కూడా రికార్డు స్థాయిలో మంచి లాభాలను ఆర్జించాయి. ఇక రిలయన్స్​ సంస్థల షేర్​ విలువ ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఒక్క షేర్​ విలువ రూ.2,841.8గా ఉంది. రిలయన్స్​కు తోడు ఐటీసీ సంస్థ షేర్ల కొనుగోళ్లు కూడా మార్కెట్​ జోరు కొనసాగడంలో కీలక పాత్ర పోషించాయి. మరోవైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) బుధవారం కూడా తమ కొనుగోళ్లలో దూకుడును ప్రదర్శించారు. మొత్తం రూ.2,115.84 కోట్ల విలువైన ఈక్విటీలను వీరు కొనుగోలు చేశారు.

లాభాలతో ముగిసిన షేర్లు..
ఎన్​టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, ఐటీసీ, పవర్ గ్రిడ్​, లార్సెన్ అండ్ టుబ్రో కంపెనీల ట్రేడింగ్​ లాభాలతో ముగిసింది.

నష్టాల బాటలో ఈ సంస్థలు..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్‌ నష్టాలతో ముగిశాయి.

రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 5 పైసలు తగ్గి రూ.82.09 వద్ద కొనసాగుతోంది.

విదేశీ మార్కెట్లు..
ఆసియా మార్కెట్ల విషయానికొస్తే సియోల్, టోక్యో, షాంఘై మార్కెట్లు లాభాలతో ముగియగా.. హాంకాంగ్ నష్టపోయింది. యూరప్‌లోని ఈక్విటీ మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు కూడా సానుకూలంగా ముగిశాయి. ఆటోమొబైల్స్​, ఐటీ మినహా అన్ని ప్రధాన రంగాలలో కొనుగోళ్లు ఆశాజనకంగా జరిగాయని.. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ అధికారి చెప్పారు.

Last Updated : Jul 19, 2023, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details