దలాల్ స్ట్రీట్‌లో 'బుల్'రన్.. ఐటీ, ఆర్థిక షేర్ల జోష్.. సెన్సెక్స్ 870 ప్లస్ - stocks news
14:47 April 21
దలాల్ స్ట్రీట్‌లో 'బుల్'రన్.. ఐటీ, ఆర్థిక షేర్ల జోష్.. సెన్సెక్స్ 870 ప్లస్
Stock Market LIVE Updates: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్లోనూ భారీ లాభాలను నమోదుచేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 874 పాయింట్ల లాభంతో.. 57 వేల 912 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 256 పాయింట్లు పెరిగి.. 17 వేల 393 వద్ద సెషన్‌ను ముగించింది. ఓ దశలో సెన్సెక్స్ 950పాయింట్లకుపైగా పెరగడం విశేషం.
- ఐచర్ మోటార్స్, కోల్ ఇండియా, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, రిలయన్స్ షేర్లు రాణించాయి. సిప్లా, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, హిందాల్కో, నెస్లే డీలాపడ్డాయి. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో దాదాపు అన్నీ సానుకూలంగా కదలాడుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఫార్మా, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి.
- బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతం మేర పుంజుకున్నాయి.
- ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్, ఐటీ షేర్లు పుంజుకోవడం మార్కెట్ల దూకుడుకు కారణంగా విశ్లేషిస్తున్నారు వ్యాపార నిపుణులు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువ.. 2788.80 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. గురువారం సెషన్లో ఈ షేరు 2 శాతానికిపైగా పెరగడం విశేషం.
- ఆటో, ఐటీ, ఫార్మా సూచీలు ఒక శాతం మేర మెరుగుపడ్డాయి. నాలుగో త్రైమాసికంలో ఐటీ షేర్లు మంచి ఫలితాలను ప్రకటించవచ్చని వెలువడిన అంచనాలు మదుపరుల్లో ఉత్సాహం నింపాయి.
- అమెరికా మార్కెట్లు మిశ్రమంగా స్పందించినా.. ఆసియా సూచీలు దూసుకెళ్లాయి. నిక్కీ, కోస్పీ, సియోల్ సూచీలు లాభాల్లో ఉండగా.. షాంఘై, హాంగ్ సెంగ్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
- 5 వరుస సెషన్ల నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి. సెన్సెక్స్ 574, నిఫ్టీ 178 పాయింట్ల మేర పెరిగాయి.
ఇవీ చూడండి:స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. మెరుగుపడిన బిట్ కాయిన్
స్టార్టప్‌లకు మైక్రోసాఫ్ట్ సహకారం.. కృత్రిమ మేధ అభివృద్ధి చేసుకునేలా