స్టాక్ మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లో ముగిశాయి. ఉదయం మచి జోష్‌తో ప్రారంభమైన సూచీలు.. ముగింపు సమయానికి గంటన్నర ముందు నుంచి నష్టాల బాటలో పయనించాయి. దీంతో సెన్సెక్స్ 136 పాయింట్లు కోల్పోయింది. చివరకు 52,793 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి.. 15,780 వద్ద ముగిసింది.
ఆరంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ - స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్
16:22 May 13
11:10 May 13
Stock Market Updates: స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 550 పాయింట్లకుపైగా లాభంతో 53 వేల 500 ఎగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 200 పాయింట్లు పెరిగి.. 16 వేల మార్కు ఎగువన ఉంది.
09:39 May 13
5 వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్.. 53 వేల ఎగువన సెన్సెక్స్
Stock Market Live Updates: స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వారాంతపు సెషన్లో దేశీయ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 350పాయింట్లకుపైగా పెరిగి.. 53 వేల 300 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో.. 16 వేలకు చేరువలో ఉంది. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో దాదాపు షేర్లన్నీ లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు మార్కెట్లలో లాభాలకు కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆసియా మార్కెట్లన్నీ దాదాపు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.
టాటా మోటార్స్, సన్ ఫార్మా, యూపీఎల్, అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ మంచి లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్, విప్రో, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, శ్రీ సిమెంట్స్ నష్టాల్లో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆయా కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిచ్చే అవకాశం ఉందన్న ఆశలతో మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అయితే, దేశీయంగా ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.79 శాతంగా నమోదు కావడం కొంత కలవరపెడుతున్న అంశం. గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.