తెలంగాణ

telangana

ETV Bharat / business

చివర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు - Closing Bell: Market erases gains to end flat; Power, IT stocks shine, realty drags

Stock Market Live Updates
Stock Market Live Updates

By

Published : May 5, 2022, 9:28 AM IST

Updated : May 5, 2022, 3:48 PM IST

15:35 May 05

స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్​గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే నాటికి సెన్సెక్స్ 33 పాయింట్లు వృద్ధి చెంది 55,702 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 5 పాయింట్ల పెరిగి 16,682 వద్ద స్థిరపడింది. ఓ దశలో దాదాపు 900 పాయింట్ల మేర పెరిగిన సెన్సెక్స్​.. భారీగా తగ్గింది. చివరకు సూచీలు ఫ్లాట్​గా ముగిశాయి. పవర్, ఐటీ రంగాలు లాభాలను నమోదు చేయగా.. రియల్​ ఎస్టేట్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా సూచీలు తీవ్రంగా నష్టపోయాయి.

  • సెన్సెక్స్​లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్​ , హెచ్​సీఎల్​ టెక్​, విప్రో, టాటా స్టీల్​, కొటాక్​ బ్యాంక్​, టీసీఎస్​, హెడ్ఎఫ్​సీ, ఐసీఐసీఐ షేర్లు లాభాలు గడించాయి. మారుతి, హెడ్​ఎఫ్​సీ బ్యాంక్​, పవర్​ గ్రిడ్​, యాక్సిస్​ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్​​, టాటా ​,టైటాన్​ షేర్లు నష్టాలతో ముగిశాయి.
  • నిఫ్టీలో టెక్​ మహీంద్రా, హీరో మోటో, ఇన్ఫీ, హెచ్​సీఎల్​ టెక్​, విప్రో లాభాలు ఆర్జించాయి. ఇండస్ ఇండ్​ బ్యాంక్​, బ్రిటానియా, టాటా, సన్​ఫార్మా షేర్లు నష్టాలతో ముగిశాయి.

13:59 May 05

ఆరంభ లాభాలు ఆవిరి.. భారీ లాభాల నుంచి స్టాక్​ మార్కెట్లు వెనక్కిమళ్లాయి. ఓ దశలో దాదాపు 900 పాయింట్ల మేర పెరిగిన సెన్సెక్స్​.. భారీగా తగ్గింది. ప్రస్తుతం 30 పాయింట్ల నష్టంతో.. 55 వేల 630 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు తగ్గి.. 16 వేల 663 వద్ద కొనసాగుతోంది. టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్​, హీరో మోటోకార్ప్​, టాటా స్టీల్​, హెచ్​సీఎల్​ టెక్​ లాభాల్లో ఉన్నాయి. ఇండస్​ఇండ్​ బ్యాంక్​, నెస్లే, బ్రిటానియా, అల్ట్రాటెక్​ సిమెంట్ నష్టపోయాయి.

10:25 May 05

Stock Market Updates: స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ దాదాపు 700 పాయింట్ల లాభంతో 56 వేల 372 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 210 పాయింట్లకుపైగా పెరిగి 16 వేల 890 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు గత సెషన్​లో మంచి లాభాల్లో ముగియడం, దేశీయ సూచీలు గత సెషన్​లో భారీగా నష్టపోవడం నేపథ్యంలో.. ఇవాళ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఇన్ఫోసిస్​ సహా ఇతర హెవీవెయిట్​ షేర్లు పుంజుకోవడం మార్కెట్ల లాభాలకు కారణం.

ఆటో, బ్యాంకింగ్​, ఐటీ, లోహ రంగాల షేర్లు దూసుకెళ్తున్నాయి. బ్యాంకింగ్​, విద్యుత్​ షేర్లు 2 శాతం మేర పెరిగాయి. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో దాదాపు అన్నీ లాభాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్​, టెక్​ మహీంద్రా, ఇన్ఫీ, టాటా స్టీల్​, ఓఎన్​జీసీ, ఎస్​బీఐ రాణిస్తున్నాయి. నెస్లే, టైటాన్​ కంపెనీ, అల్ట్రాటెక్​ సిమెంట్స్​, అపోలో హాస్పిటల్స్​ డీలాపడ్డాయి.

09:17 May 05

చివర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు

Stock Market Live Updates: భారీ నష్టాల నుంచి.. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు బలంగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ తొలుత దాదాపు 650 పాయింట్ల మేర లాభంతో ప్రారంభమైంది. ప్రస్తుతం 400 పాయింట్లు పెరిగి 56 వేల 70 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 16 వేల 807 వద్ద ట్రేడవుతోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కీలక రేట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ ప్రకటించిన నేపథ్యంలో.. గత సెషన్​లో సెన్సెక్స్​ 1307, నిఫ్టీ 392 పాయింట్లు పతనమైంది.

హీరో మోటోకార్ప్​, ఓఎన్​జీసీ, టెక్​ మహీంద్రా, టాటా స్టీల్​, కోటక్​ మహీంద్రా రాణిస్తున్నాయి. నెస్లే, టైటాన్​ కంపెనీ, ఎన్​టీపీసీ, అపోలో హాస్పిటల్స్​, భారతీ ఎయిర్​టెల్​ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఫెడరల్​ రిజర్వు కీలక వడ్డీ రేట్లను 0.5 శాతం మేర పెంచినప్పటికీ అక్కిడ మార్కెట్లు బుధవారం మంచి లాభాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగానూ బలమైన సంకేతాలతో దేశీయ సూచీలు లాభాల్లో ఉన్నట్లు వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:ఆర్​బీఐ షాక్.. వడ్డీ రేట్లు పెంపు.. ఈఎంఐలు మరింత భారం

వడ్డీ రేట్లు పెంచిన ఫెడ్.. 20ఏళ్లలో ఇదే అత్యధికం

Last Updated : May 5, 2022, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details