తెలంగాణ

telangana

ETV Bharat / business

తొలి రోజున రంకెలేసిన బుల్​.. 59వేల ఎగువకు సెన్సెక్స్​​

Stock Market Live Updates
Stock Market Live Updates

By

Published : Apr 1, 2022, 9:37 AM IST

Updated : Apr 1, 2022, 3:44 PM IST

15:41 April 01

బుల్​ జోరు..

Stock markets: దేశీయ స్టాక్​ మార్కెట్లు.. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున భారీ లాభాలను ఘడించాయి. ఉదయం ఫ్లాట్​గా ప్రారంభమైనప్పటికీ బ్యాంకు, ఆయిల్​, గ్యాస్​, విద్యుత్తు, స్థిరాస్తి రంగాల దూకుడుతో క్రమంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లకు మదుపరులు మొగ్గు చూపగా.. సెన్సెక్స్​ 700 పాయింట్ల మేర లాభపడింది. నిఫ్టీ 200లకుపైగా వృద్ధి చెందింది.

  • ముంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 708 పాయింట్ల లాభంతో 59,276 వద్ద స్థిరపడింది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ - నిఫ్టీ 206 పాయింట్లు వృద్ధి చెంది 17,670 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి: ఎన్​టీపీసీ షేర్లు 6 శాతం మేర లాభపడ్డాయి. బీపీసీఎల్ 4 శాతం​, పవర్​ గ్రిడ్ 4 శాతం, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ 3.5శాతం, ఎస్​బీఐ​ 3.1 శాతం మేర లాభాల్లోకి వెళ్లాయి. మరోవైపు.. హీరో మోటోకార్ప్​ 2.4 శాతం మేర నష్టపోయింది. టెక్​ మహీంద్రా, సన్​ ఫార్మా, ఎస్​బీఐ లైఫ్​ ఇన్స్యూరెన్స్​, టైటాన్​ కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

08:52 April 01

కొత్త ఆర్థిక సంవత్సరం వేళ.. ఫ్లాట్​గా మార్కెట్లు

Stock Market Live Updates: దేశీయ స్టాక్​ మార్కెట్లు.. కొత్త ఆర్థిక సంవత్సరం వేళ ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 40 పాయింట్లు పెరిగి.. 58 వేల 608 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 17 వేల 479 వద్ద ఉంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, బీపీసీఎల్​, కోల్​ఇండియా, అదానీ పోర్ట్స్​ లాభాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​, టైటాన్​ కంపెనీ డీలాపడ్డాయి.

Last Updated : Apr 1, 2022, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details