దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్ఛేంజీ- సెన్సెన్స్ 456 పాయింట్లు వృద్ధి చెంది 53 వేల 184 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ- నిఫ్టీ 132 పాయింట్లు మెరుగుపడి 15 వేల 832 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాల్లో ఉండటం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది.
ఎల్అండ్టీ, హెచ్సీఎల్ టెక్ షేర్లు రెండున్నర శాతానికి పైగా లాభాపడ్డాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, భారతీ ఎయిర్టెల్, టాటాస్టీల్ షేర్లు కూడా వృద్ధి చెందాయి. టైటాన్, రిలయన్స్, కొటాక్ బ్యాంక్ అతిస్వల్పంగా నష్టపోయాయి.
స్టాక్ మార్కెట్లకు లాభాలు.. సెన్సెక్స్ 456 ప్లస్
స్టాక్ మార్కెట్లు
15:37 June 27
09:20 June 27
స్టాక్ మార్కెట్లకు లాభాలు.. సెన్సెక్స్ 456 ప్లస్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 600లకు పైగా పాయింట్లతో కొనసాగుతుండగా.. నిఫ్టీ 15,800 ఎగువన ట్రేడవుతోంది.
- ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 604 పాయింట్ల లాభంతో 53,332 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
- జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 183 పాయింట్ల వృద్ధితో 15,882 వద్ద ట్రేడవుతోంది.
- పాజిటివ్లోనే.. హిందాల్కో, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ ఎం, పవర్ గ్రిడ్లు దాదాపు 2 శాతానికిపైగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
Last Updated : Jun 27, 2022, 3:38 PM IST