తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫెడ్ వడ్డీ రేట్ల భయాలు, స్టాక్ మార్కెట్లకు భారీ లాస్, సెన్సెక్స్ 870 డౌన్

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 872.28 పాయింట్లు నష్టపోయి 58,773.87 వద్ద ముగిసింది, నిఫ్టీ 267.75 పాయింట్లు క్షీణించి 17,490.70 వద్దకు చేరుకుంది.

STOCK MARKET
STOCK MARKET CLOSING

By

Published : Aug 22, 2022, 4:12 PM IST

Updated : Aug 22, 2022, 5:08 PM IST

STOCK MARKET CLOSING: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలతో మదుపరులు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు అన్ని రంగాల కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. బీఎస్​ఈ మిడ్​క్యాప్​, స్మాల్​క్యాప్​ షేర్లు కూడా 1 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్​ 872.28 పాయింట్లు నష్టపోయి 58,773.87 వద్ద ముగిసింది, నిఫ్టీ 267.75 పాయింట్లు క్షీణించి 17,490.70 వద్దకు చేరుకుంది.

లాభనష్టాల్లో ఇవే..
ఐటీసీ, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. డాక్టర్​ రెడ్డీస్, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇండస్​ లాండ్, భారతీ ఎయిర్​టెల్​, ఎన్​టీపీసీ, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి.

రూపాయి విలువ:
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే.. రూ.79.84 వద్ద స్థిరపడింది.
చమురు ధర:బ్రెంట్ చమురు ధర 0.81 శాతం తగ్గి 95.94 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Last Updated : Aug 22, 2022, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details