Stock Market Close Today 20th September 2023 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం సహా, విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడం కూడా ఇందుకు కారణం. దీనికితోడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ త్వరలో కీలక వడ్డీ రేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో.. మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడం కూడా.. మాార్కెట్ పతనానికి మరో కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 796 పాయింట్లు నష్టపోయి 66,800 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 231 పాయింట్లు కోల్పోయి 19,901 వద్ద స్థిరపడింది.
- లాభపడిన షేర్స్: పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీ, టీసీఎస్
- నష్టపోయిన స్టాక్స్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టాటా స్టీల్, మారుతి సుజుకి, విప్రో, టైటాన్
భారీగా నష్టపోయిన బ్యాంకింగ్, ఆయిల్ స్టాక్స్
బుధవారం దేశీయ బ్యాంకింగ్, ఆయిల్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4 శాతం మేర నష్టపోయింది. దీనితోపాటు ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ఐఓసీ, బీపీసీఎల్.. కూడా నష్టాలను చవిచూశాయి.