తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 4:05 PM IST

Updated : Sep 13, 2023, 4:47 PM IST

ETV Bharat / business

Stock Market Close Today 13th September 2023 : భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 50@20,070 రికార్డ్ ముగింపు!

Stock Market Close Today 13th September 2023 : బుధవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 50 రికార్డ్​ స్థాయిలో 20,070 పాయింట్లు వద్ద స్థిరపడింది. దేశీయ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉండడమే ఇందుకు కారణం.

share Market Close Today 13th September 2023
Stock Market Close Today 13th September 2023

Stock Market Close Today 13th September 2023 : దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా తొమ్మిదో రోజు కూడా భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ 50 మొదటిసారిగా రికార్డ్​ స్థాయిలో 20,070 పాయింట్ల వద్ద స్థిరపడింది. దేశీయ వృద్ధిపై మదుపరులు ఆశాజనకం ఉండడంతో దేశీయ మార్కెట్లు వరుస లాభాలను మూటగట్టుకుంటున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 245 పాయింట్లు లాభపడి 67,466 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 76 పాయింట్లు వృద్ధి చెంది 20,070 పాయింట్లు వద్ద స్థిరపడింది.

లాభనష్టాలు
బుధవారం ప్రధానంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లోని.. బ్యాంకింగ్, ఎనర్జీ, టెలికాం షేర్స్ భారీగా లాభపడ్డాయి.

  • లాభపడిన షేర్స్​ : భారతీ ఎయిర్​టెల్​, టైటాన్​, యాక్సిస్ బ్యాంక్​, ఎస్​బీఐ, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, టాటా మోటార్స్​
  • నష్టపోయిన స్టాక్స్​ : ఎం అండ్ ఎం, ఎల్​ అండ్ టీ, ఇన్ఫోసిస్​, టీసీఎస్​, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్​

ఎఫెక్ట్ పడలేదు!
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు వీచినప్పటికీ.. దేశీయ మార్కెట్లపై అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఆగస్టులో దేశీయ రిటైల్​ ద్రవ్యోల్బణం 6.83 శాతానికి దిగివచ్చింది. మరోవైపు దేశీయ పరిశ్రమల ఉత్పత్తి భారీగా పెరిగింది. దీనితో భారతదేశ వృద్ధి అంచనాలు చాలా ఆశాజనకంగా మారాయి. అందుకే మదుపరులు స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేయడానికి అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లు
Global Markets Today 13th September 2023 : యూఎస్​ ఇన్​ఫ్లేషన్​ డేటా, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్​ పాలసీ ప్రకటన కోసం మదుపరులు వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు యూకే ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉండడం, క్రమంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ మార్కెట్లు తీవ్రమైన ఒడుదొడుకులకు లోనవుతున్నాయని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఆసియా మార్కెట్లు
Asaian Markets Today 13th September 2023 :సియోల్​, షాంఘై, హాంకాంగ్​ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. మరోవైపు టోక్యో స్టాక్​ మార్కెట్లు మాత్రం లాభాలతో స్థిరపడ్డాయి.

ముడిచమురు ధరలు
Crude Oil Price Today 13th September 2023 : బుధవారం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 0.66 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 92.56 డాలర్లుగా ఉంది.

Last Updated : Sep 13, 2023, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details