తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు మళ్లీ నష్టాలే.. సెన్సెక్స్​ 230, నిఫ్టీ 70 డౌన్​

Stock Market Close: స్టాక్​ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 233, నిఫ్టీ 70 పాయింట్ల మేర కోల్పోయాయి.

Stock Market Close
Stock Market Close

By

Published : Mar 25, 2022, 3:42 PM IST

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వరుస నష్టాలు నమోదుచేస్తున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 233 పాయింట్లు కోల్పోయి.. 57 వేల 362 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 70 పాయింట్లు తగ్గి 17 వేల 153 వద్ద సెషన్​ను ముగించింది. ఐటీ, ఫార్మా, ఎఫ్​ఎంసీజీ షేర్లు కుదేలయ్యాయి. రియాల్టీ రంగం ఒక శాతం మేర పెరిగింది. ఆసియా మార్కెట్లలో బలహీన సంకేతాలతో.. దేశీయ సూచీలు ప్రతికూలంగానే ట్రేడయ్యాయి. హెవీవెయిట్​ షేర్లు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టెక్​ మహీంద్రా, మారుతీ సుజుకీలో నష్టాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి.

సెన్సెక్స్​ తొలుత దాదాపు 200 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అనంతరం తీవ్ర ఒడుదొడుకులతో నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో దాదాపు 500 పాయింట్లు కోల్పోయి.. 57 వేల 100 వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది. 57 వేల 845 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆసియా మార్కెట్లలో టోక్యో, సియోల్​, హాంకాంగ్​, షాంఘై సూచీలు కూడా నష్టాల్లోనే కదలాడాయి. అమెరికా మార్కెట్లు మాత్రం గత సెషన్​లో మంచి లాభాలను నమోదుచేశాయి. గురువారం సెషన్​లో భారత స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్​ 89, నిఫ్టీ 23 పాయింట్ల మేర పడిపోయాయి.

లాభనష్టాల్లో ఇవే:బజాజ్​ ఆటో, అదానీ పోర్ట్స్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఏషియన్​ పెయింట్స్​, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​ రాణించాయి. టైటాన్​ కంపెనీ, టెక్​ మహీంద్రా, మారుతీ సుజుకీ, సిప్లా, నెస్లే ఇండియా నష్టపోయాయి. మొత్తంగా 1256 షేర్లు లాభపడ్డాయి. 1958 షేర్లు పతనమయ్యాయి. 91 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

ఇవీ చూడండి:మీ పేరుతో ఎవరో అప్పు చేస్తే.. ఏం చేయాలి?

బంగారం ధరకు రెక్కలు.. రూ.1100 పెరిగిన కేజీ వెండి!

ABOUT THE AUTHOR

...view details