Stock Market Closes all time high : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఆల్ టైమ్ రికార్డ్ హైతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయడం సహా, విదేశీ పెట్టుబడులు తరలిరావడం కూడా దేశీయ మార్కెట్లకు కలిసివచ్చింది. బయ్యర్లు ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, రిలయన్స్, టీసీఎస్ షేర్లు కొనడానికి ఉత్సాహం చూపించడం కూడా మరొక కారణం.
ఆల్ టైమ్ రికార్డ్ హై
ఓ సందర్భంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 853.16 పాయింట్లు చేరి, ఆల్ టైమ్ ఇంట్రా డే రికార్డ్ హై 64,768 వద్ద ట్రేడయ్యింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 216 పాయింట్లు వృద్ధి ఆల్ టైమ్ ఇంట్రాడే రికార్డ్ హై 19,201 పాయింట్లకు చేరింది.
చివరకు.. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 803.14 పాయింట్లు లాభపడి 64,718 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 216 పాయింట్లు వృద్ధి చెంది 19,189 పాయింట్లు వద్ద స్థిరపడింది.
లాభాలతో ముగిసిన స్టాక్స్ : ఎమ్ అండ్ ఎమ్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంకు, సన్‌ఫార్మా, టీసీఎస్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, విప్రో, టైటాన్, ఎస్బీఐ, ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, టాటాస్టీల్
నష్టాలతో ముగిసిన షేర్లు : ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంకు