తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు ఎస్​బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంపు

State Bank Of India Deposit Rate Increased:స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా.. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 కోట్లు, అంతకుమించిన టర్మ్‌ డిపాజిట్‌ రేట్లను 40-90 బేసిస్‌ పాయింట్ల (0.4-0.9 శాతం) మేర పెంచినట్లు మంగళవారం ఎస్‌బీఐ ప్రకటించింది.

DOC Title * state-bank-of-india-bulk-depositr-rate-in-creased
DOC Title * state-bank-of-india-bulk-depositr-rate-in-creased

By

Published : May 11, 2022, 4:41 AM IST

State Bank Of India Deposit Rate Increased: రూ. 2 కోట్లు, అంతకుమించిన (బల్క్‌) టర్మ్‌ డిపాజిట్‌ రేట్లను 40-90 బేసిస్‌ పాయింట్ల (0.4-0.9 శాతం) మేర పెంచినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మంగళవారం ప్రకటించింది. ఈనెల 10 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. 7-45 రోజుల్లో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటును 3 శాతం వద్దే ఉంచింది. 46-179 రోజుల డిపాజిట్లపై వడ్డీరేటును 3 శాతం నుంచి 3.5 శాతానికి, 180-240 రోజుల డిపాజిట్లపై 3.1 శాతం నుంచి 3.5 శాతానికి వడ్డీ రేట్లను మార్చినట్లు బ్యాంక్‌ పేర్కొంది. 211 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 3.3 శాతం నుంచి 45 బేసిస్‌ పాయింట్లు పెంచి 3.75 శాతానికి చేర్చింది. మిగతా కాలావధులపై వడ్డీ రేట్లు పట్టికలో..

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్లు

యూనియన్‌ బ్యాంక్‌ కూడా..:రూ.100 కోట్లకు మించిన పొదుపు డిపాజిట్లపై వడ్డీరేటును జూన్‌ 1 నుంచి 20-65 బేసిస్‌ పాయింట్ల మేర పెంచబోతున్నట్లు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. రూ.50 లక్షల నుంచి రూ.100 కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటును 2.9% వద్దే ఉంచింది. రూ.100-500 కోట్ల డిపాజిట్లపై 2.90 శాతం నుంచి 3.10 శాతానికి, రూ.500-1000 కోట్ల డిపాజిట్లపై 2.90 శాతం నుంచి 3.40 శాతానికి, రూ.1000 కోట్ల పైబడిన డిపాజిట్లపై 2.90 శాతం నుంచి 3.55 శాతానికి పెంచింది. రూ.50 లక్షల కంటే తక్కువ ఉన్న పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటును 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 2.75 శాతానికి పరిమితం చేయనుంది.

*గత వారం ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ (పీఎన్‌బీ) బ్యాంక్‌ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను 60 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు, ఈ నెల 7 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కొత్త రేట్లు రూ.10 కోట్ల డిపాజిట్ల వరకు వర్తిస్తాయని పీఎన్‌బీ వెల్లడించింది.

ఇదీ చదవండి:ఎల్‌ఐసీ ఐపీఓకు 1.79 రె్ల స్పందన.. దరఖాస్తుకు చివరి రోజు నేడే

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. సింపుల్ విద్యార్హత... రూ.98వేల జీతం!

ABOUT THE AUTHOR

...view details