తెలంగాణ

telangana

ETV Bharat / business

Sovereign Gold Bonds : సావరిన్​ గోల్డ్ బాండ్​ సబ్​స్క్రిప్షన్ షురూ.. మీరూ ఇన్వెస్ట్ చేస్తారా? - sgb interest rate

Sovereign Gold Bonds In Telugu : సావరిన్​ గోల్డ్​ బాండ్​ 2023 సిరీస్-2​ సబ్​స్క్రిప్షన్​ సోమవారం (సెప్టెంబర్​ 11న) ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గ్రాము బంగారానికి రూ.5,923 చొప్పున ఇష్యూ ధరను నిర్ణయించింది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి, మంచి ఆదాయం సంపాదించాలని అనుకునే వారికి ఇది సరైన అవకాశం. మరిన్ని పూర్తి వివరాలు మీ కోసం.

Sovereign Gold Bonds price
Sovereign Gold Bonds

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 11:52 AM IST

Sovereign Gold Bond Scheme 2023-24 :రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) సావరిన్​ గోల్డ్ బాండ్​ 2023 సిరీస్​ -2ను సోమవారం (సెప్టెంబర్​ 11న) ప్రారంభించనుంది. ఈ సబ్​స్క్రిప్షన్​ సెప్టెంబర్​ 10 నుంచి ప్రారంభమై సెప్టెంబర్​ 15తో ముగుస్తుంది. ఈ సావరిన్​ గోల్డ్ బాండ్​ సబ్​స్క్రిప్షన్​లో ఒక గ్రాము బంగారం ఇష్యూ ధరను రూ.5,923 గా నిర్ణయించారు. అయితే ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకొని, ఆన్​లైన్​లోనే సబ్​స్క్రిప్షన్​ రుసుము చెల్చించినవారికి ఒక్కో గ్రాముపై రూ.50 డిస్కౌంట్​ లభిస్తుంది. అంటే డిజిటల్​ మోడ్​లో దరఖాస్తు చేసుకున్న పెట్టుబడిదారులకు ఇష్యూ ధర రూ.5,873గా ఉంటుంది. సావరిన్​ గోల్డ్ బాండ్స్​ (ఎస్​జీబీ)లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ప్రతి 6 నెలలకు ఒకసారి 2.5 శాతం వడ్డీ చొప్పున చెల్లిస్తారు.

సావరిన్ గోల్డ్ బాండ్స్​కు అప్లై చేసుకోవడం ఎలా?
How To Apply Sovereign Gold Bond Online : సావరిన్ గోల్డ్ బాండ్​ స్కీమ్​ 2023-24 సిరీస్​-2 అనేది స్టాక్​ హోల్డింగ్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (SHCIL), బ్యాంక్స్​, కొన్ని నిర్దేశిత పోస్ట్​ ఆఫీసులు, ఎన్​​ఎస్​ఈ, బీఎస్​ఈ స్టాక్​ ఎక్స్ఛేంజ్​ల్లో అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు వీటి నుంచి నేరుగా సార్వభౌమ పసిడి బాండ్లను సబ్​స్క్రైబ్​ చేసుకోవచ్చు.

దీర్ఘకాలిక పెట్టుబడి
ఎస్​జీబీ కాలపరిమితి 8 సంవత్సరాలు. వాస్తవానికి ఈ ఎస్​జీబీలను స్టాక్​ మార్కెట్​లో లిస్ట్ చేస్తారు. కనుక పెట్టుబడిదాలు స్టాక్​ ఎక్స్ఛేంజీల్లో వాటికి సంబంధించిన లావాదేవీలు చేసుకోవచ్చు. ఒక వేళ మధ్యలో సావరిన్ గోల్డ్​ బాండ్​ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటే.. 5 సంవత్సరాల తరువాత ఆర్​బీఐ వద్ద కూడా వాటిని రీడీమ్ చేసుకోవచ్చు.

అదనపు లాభం
Sovereign Gold Bond Benefits :సావరిన్​ గోల్డ్ బాండ్​లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభం ఉంటుంది. ఎలా అంటే.. మెచ్యూరిటీ టైమ్​లో అప్పటికి మార్కెట్​లో ఉన్న బంగారం ధర ఆధారంగా మీకు చెల్లింపులు చేస్తారు. మీకు గోల్డ్​ బాండ్స్​ ఇష్యూ సమయంలో వాగ్దానం చేసిన వడ్డీతో పాటు ఇది అదనం అన్నమాట. కనుక ఎస్​జీబీలో ఇన్వెస్ట్ మంచి ఆప్షన్​ అవుతుంది.

చాలా ఉపయోగాలు ఉన్నాయి
Sovereign Gold Bond Interest Rates :సావరిన్ గోల్డ్ బాండ్​.. ఒక ఫైనాన్షియల్​ ఇన్​స్ట్రూమెంట్​. ఫిజికల్ గోల్డ్​ను మనం కొంటే దానికి ఎలాంటి వడ్డీ రాదు. పైగా దొంగల బెడద ఎక్కువ. దానిని బ్యాంక్​ లాకర్​లలో దాస్తే, తిరిగి మనమే బ్యాంకులకు డబ్బు కట్టాల్సి వస్తుంది. బంగారానికి ఇన్సూరెన్స్​ కూడా చేయలేము. వాస్తవానికి మ్యూచువల్​ ఫండ్​లో పెట్టుబడులు పెడితే, ఆసెట్​ మేనేజ్​మెంట్​ ఫీజు కట్టాల్సి ఉంటుంది. కానీ సావరిన్​ గోల్డ్​ బాండ్​లో అలాంటి ఆసెట్​ మేనేజ్​మెంట్ ఫీజు అనేది ఉండదు. పైగా ప్రభుత్వమే మీకు 2.5 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తుంది.

టాక్స్​ బెనిఫిట్స్​
Sovereign Gold Bond Tax Benefits :ఎస్​జీబీ పెట్టుబడుల వల్ల టాక్స్ బెనిఫిట్స్​ ఉంటాయి. శ్లాబ్​ రేటు వద్ద వడ్డీపై టాక్స్ విధిస్తారు. కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినవారిపై ఈ టాక్స్​ భారం ఉండదు.

లిక్విడిటీ కష్టమే!
Sovereign Gold Bond Liquidity :ఎస్​జీబీలు స్టాక్​ మార్కెట్​లో లిస్ట్ అయినప్పటికీ లిక్విడిటీ కాస్త కష్టమే. ఎందుకంటే గోల్డ్​ బాండ్స్​ సాధారణంగా ఫెయిర్​ వాల్యూకు దగ్గరగా ట్రేడ్​ అవ్వవు. మార్కెట్​ సెంటిమెంట్​ ఆధారంగా వాటి ధరలు మారుతూ ఉంటాయి. అలాగే ఇన్వెస్టర్లు వెంటనే డబ్బులు చేసుకోవడం కూడా కష్టమవుతుంది.

సావరిన్​ గోల్డ్ బాండ్​లో పెట్టుబడులు పెట్టవచ్చా?
Should You Invest In Sovereign Gold Bonds? : ప్రపంచ మార్కెట్లు ఒడుదొడుకులు లోనవుతున్నప్పుడు, ఆర్థిక మాంద్యం సమయాల్లో బంగారం ధర కచ్చితంగా బాగా పెరుగుతుంది. అందువల్ల సావరిన్​ గోల్డ్​ బాండ్​ల్లో ఇన్వెస్ట్ చేయడం మంచి ఎంపిక అవుతుంది. అయితే దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఈ ఎస్​జీబీల్లో ఇన్వెస్ట్ చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇన్వెస్టర్లు తమ వ్యక్తిగత పోర్టుఫోలియోలో కేవలం 10%-15% శాతం వరకు మాత్రమే వీటికి కేటాయించాలని స్పష్టంగా సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details