తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో తగ్గిన స్మార్ట్ టీవీ ధరలు.. పెరిగిన కొనుగోళ్లు

Smart TV Shipments : దేశంలో స్మార్ట్ టీవీల అమ్మకాలు భారీగా పెరిగాయి. గతేడాది జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్‌టీవీల అమ్మకాలు 38 శాతం వృద్ధి చెందాయని కౌంటర్​పాయింట్ నివేదిక వెల్లడించింది.

Smart TV
స్మార్ట్ టీవీ

By

Published : Dec 3, 2022, 5:25 PM IST

Smart TV Shipments : స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వృద్ధి క్షీణించినప్పటికీ.. దేశంలో స్మార్ట్‌ టీవీల మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. గతేడాది జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్‌టీవీల అమ్మకాలు 38 శాతం మేర పెరిగాయని కౌంటర్​పాయింట్ నివేదిక వెల్లడించింది.

ముఖ్యంగా వరుస పండగలు, ఆఫర్లు, కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావడం, డిస్కౌంట్లు వంటివి విక్రయాలు పెరిగేందుకు దోహదం చేశాయని కౌంటర్​పాయింట్​ నివేదిక పేర్కొంది. టీవీ విక్రయాల్లో 93 శాతం స్మార్ట్‌ టీవీలే ఉంటున్నాయని తెలిపింది. రూ.20,000 ధరలో సామాన్యులను స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించింది. అందువల్ల ఈ మరింత విక్రయాలు పెరిగే అవకాశాలున్నాయని నివేదిక తెలిపింది. ఓటీటీ కంటెంట్​ను వీక్షకులు ఎక్కువ ఆసక్తి చూపడం వల్ల స్మార్ట్ టీవీల అమ్మకాలు పెరిగాయని వెల్లడించింది.

"నాన్ స్మార్ట్ టీవీ వాడుతున్నవారు కూడా స్మార్ట్ టీవీవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే ఈ త్రైమాసికంలో 93 శాతానికి స్మార్ట్ టీవీలు అమ్మకాలు పెరిగాయి. రూ.25,000 ధరకే గూగుల్ టీవీ కూడా సామాన్యులకు అందుబాటులో వచ్చేసింది. మరిన్ని కొత్త మోడళ్లు కూడా రూ.20,000 ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది."

-- అన్షిక జైన్, కౌంటర్​పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్

ABOUT THE AUTHOR

...view details