Small Finance Banks Offer Interest Rates on 3 Years Fixed Deposits:భవిష్యత్ అవసరాల కోసం ప్రతి ఒక్కరూ పొదుపు, మదుపు చేయాలనుకుంటారు. ముఖ్యంగా తాము కష్టపడి సంపాదించిన డబ్బులు పదిలంగా ఉంటూనే, వాటిపై రాబడి రావాలని ఆశిస్తూ ఉంటారు. అలాంటి వారికి బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్‌గా ఉన్నాయి. ప్రస్తుతం డిపాజిట్లపై బ్యాంకులు మంచి వడ్డీ రేట్లు అందిస్తుడటం వల్ల అటువైపు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సైతం జనాలను ఆకర్షించే స్కీమ్స్ ప్రవేశపెడుతున్నాయి. 3 సంవత్సరాల ఎఫ్‌డీపై ఏకంగా 8 శాతం పైన వడ్డీ అందిస్తున్నాయి. మరి ఆ బ్యాంకులు, వాటి వడ్డీ రేట్ల వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Suryoday Small Finance Bank):
ఈ బ్యాంకు.. మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8.6 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇందులో ఒక లక్ష ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి చేతికి రూ. 1.29 లక్షలు వస్తాయి.
బ్యాంక్ అదిరిపోయే శుభవార్త - హోమ్ లోన్ తీసుకోండి - 12 EMIలు కట్టక్కర్లేదు!
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Jana Small Finance Bank):
ఈ బ్యాంకు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల ద్వారా ఇన్వెస్టర్లకు 8.5 శాతం మేర వడ్డీ అందిస్తోంది. ఈ బ్యాంకులో మీరు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మూడేళ్ల తర్వాత రూ.1.28 లక్షలకుపైగా అందుతాయి.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. (Utkarsh Small Finance Bank) :
ఈ బ్యాంకులో కూడా మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల ద్వారా ఇన్వెస్టర్లకు 8.5 శాతం మేర వడ్డీ అందిస్తోంది. ఈ బ్యాంకులో మీరు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మూడు సంవత్సరాల తర్వాత రూ.1.28 లక్షలకుపైగా అందుతాయి.