తెలంగాణ

telangana

ETV Bharat / business

'ప్రతి కార్​లో 6 ఎయిర్​ బ్యాగ్స్​' రూల్ విషయంలో కేంద్రం ట్విస్ట్

Six Airbags Mandatory : కార్లలో ఆరు ఎయిర్​ బ్యాగులను తప్పనిసరి చేయాలనే నిర్ణయం అమలును కేంద్రం వాయిదా వేసింది. వచ్చే ఏడాది అక్టోబరు 1వరకు ఈ ప్రతిపాదనను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

six airbags mandatory
ఎయిర్​బ్యాగులు

By

Published : Sep 29, 2022, 3:27 PM IST

Updated : Sep 29, 2022, 3:57 PM IST

Six Airbags Mandatory : కార్లలో ఆరు ఎయిర్​బ్యాగులను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయాన్ని ఒక సంవత్సరంపాటు వాయిదా వేస్తున్నామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2023 అక్టోబరు 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆరు ఎయిర్​బ్యాగుల తప్పనిసరి నిర్ణయాన్ని వాయిదా వేశామని గడ్కరీ అన్నారు. ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా ఎయిర్‌ బ్యాగుల నిబంధన అమలు చేయాలని, మోటారు వాహనాల్లో ప్రయాణించే వారి భద్రతే తమకు ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి ప్రయాణికుల భద్రత కోసం ఎనిమిది సీట్ల కార్లలో ఆరు ఎయిర్​బ్యాగులను తప్పనిసరి చేయాలని కేంద్రం తొలుత భావించింది. అయితే తాజాగా మరో సంవత్సరంపాటు ఈ ప్రతిపాదన అమలును వాయిదా వేసింది. నేషనల్ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్​సీఆర్​బీ) నివేదిక ప్రకారం .. 2021వ సంవత్సరంలో దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల 1.55 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున ప్రతి గంటకు 18 మంది మరణించారు. ఈ నేపథ్యంలో కార్లలో ఆరు ఎయిర్​బ్యాగుల తప్పనిసరి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది.
'ఎక్కువగా దిగువ మధ్యతరగతి ప్రజలు తక్కువ ధర కార్లు కొనుగోలు చేస్తారు. అయితే వాటిలోనూ ఆరు ఎయిర్​బ్యాగులు ఉండాలి. లేదంటే ప్రమాదాలకు గురై.. మరణాలు సంభవిస్తాయి.' అని నితిన్ గడ్కరీ గతంలో వ్యాఖ్యానించారు.

Last Updated : Sep 29, 2022, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details