డైరెక్ట్‌గా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిలేనివారు.. ఎక్కువగా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఒకేసారి ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా.. నెలవారీగా కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ప్రాదిపదికన పెట్టుబడులు పెట్టొచ్చు. మదుపుదార్లు ఎంపిక చేసుకున్న మ్యూచువల్ ఫండ్ సంస్థ.. ఈ సిప్ ద్వారా వచ్చిన మొత్తాన్ని సెలక్టెడ్ కంపెనీల షేర్లను (యూనిట్ల రూపంలో) కొనుగోలు చేస్తుంది. అలా ప్రతి వాయిదాలో కొన్ని యూనిట్లను మ్యూచువల్ ఫండ్ సంస్థ. కొనుగోలు చేస్తూ ఉంటారు.
ఈ సిప్ వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే.. ఏకమొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. దాంతో పాటు మార్కెట్‌లోని ఒడుదొడుకుల నుంచి మదుపుదార్లకు రక్షణ లభిస్తుంది. వివిధ గణాంకాల ప్రకారం సిప్ పథకాలు దీర్ఘకాలంలో రెండంకెల వృద్ధిని అందిస్తాయి.దీని వల్ల సిప్ ప్రాదిపదికన పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆశ్రయిస్తుంటారు. ఒకవేళ 5 కోట్ల రూపాయల మొత్తాన్ని సిప్ ద్వారా సమకూర్చుకోవాలి అనుకుంటే.. 12% CAGR (వార్షిక రాబడితో) నెలవారీ ఎంత మొత్తం, ఎన్ని సంవత్సరాల పాటు మదుపు చేయాలో ఇప్పుడు చూద్దాం..
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ టాపప్ సిప్‌తో మరిన్ని లాభాలు
ఒక ఆర్థిక లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణీత మొత్తాన్ని క్రమానుగతంగా మదుపు చేయాలి. దీనికి మ్యూచువల్ ఫండ్లలో ఉత్తమమైన మార్గంగా సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)ను చెప్పుకోవచ్చు. చాలామంది ఒకసారి నిర్ణయించుకున్న మొత్తాన్నే దీర్ఘకాలం కొనసాగిస్తూ ఉంటారు. ఆదాయం పెరిగినా పెట్టుబడులను ఆ మేరకు పెంచుకోరు. దీనివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఖర్చులను తట్టుకోవడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. అందుకే, పెట్టుబడులను వీలును బట్టి, కొంత శాతం పెంచుకునే ప్రయత్నం చేయాలి. దీన్నే టాపప్ అని చెప్పొచ్చు.
'లగ్జరీ కారును కొనడం కన్నా.. ఫండ్లలో సిప్ చేసేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని' ఇటీవల ఒక ప్రముఖ కార్ల కంపెనీ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. 'సిప్' బలం అలాంటిది. దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని అందించే ఈ సిప్‌ను మరింత శక్తిమంతం చేయాలంటే.. దీన్ని క్రమం తప్పకుండా పెంచుతూ వెళ్లాలి అని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే లగ్జరీ కారు, సొంతిల్లు.. విదేశీ విహారాలు.. ఏదైనా సరే ఇట్టే సాధించొచ్చు అంటున్నారు. విలువ తరిగే ఆస్తులను కొనుగోలు చేసేందుకు అప్పులు తీసుకునే బదులు.. చిన్న మొత్తాలతో క్రమంగా మదుపు చేసి, చక్రవడ్డీ ప్రభావంతో దాన్ని వృద్ధి చేసి, అప్పుడు అవసరమైనవి కొనాలని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.