SIM Card New Rules Details in Telugu: మనుషుల జీవితంలో.. మొబైల్ ఫోన్ అతిముఖ్యమైన భాగంగా మారిపోయింది. అది లేకుంటే జీవితం ముందుకు సాగదు అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇప్పుడు చాలా ఇళ్లలో.. కనీసం రెండుకు మించిన ఫోన్లు ఉంటున్నాయి. అవసరాలు సైతం అలాగే ఉన్నాయి! సినిమా టికెట్ నుంచి రైల్వే, విమాన టికెట్ దాకా.. ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకింగ్ దాకా.. సమస్త సేవలూ మొబైల్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఇక ఆధార్ నుంచి.. పాన్ కార్డ్ దాకా.. ప్రతి గుర్తింపు కార్డుకూ.. మొబైల్ నెంబర్ లింక్ చేయాల్సిందే. ఇంతటి కీలకమైన సిమ్ కార్డుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇష్టానుసారంగా సిమ్ కార్డులు విక్రయించేవారు. అయితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డు నిబంధనల్ని కఠినతరం చేస్తోంది.
పాస్‌వర్డ్‌లో ఎమోజీలు వాడొచ్చా? ఎక్స్పర్ట్స్ మాటేమిటి?
డిసెంబర్ 1, 2023 నుంచే దేశంలో SIM కార్డ్ నిబంధనలు మారిపోతున్నాయి. సిమ్ కార్డు విక్రయాల్లో సేఫ్టీ, సెక్యూరిటీని పెంచడం సహా దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న నకిలీ సిమ్ మోసాలు, సైబర్ ఫ్రాడ్స్ అరికట్ట వేసేందుకు.. కేంద్ర టెలికాం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మీరు కొత్త సిమ్ కార్డు కొనాలనుకుంటున్నట్లయితే.. మారుతున్న నిబంధనల గురించి తప్పక తెలుసుకోవాలి.
కస్టమర్లు, డీలర్లు ఈ పని చేయాలి:
- ఒక వ్యక్తి ఒక ఐడీపై గరిష్టంగా 9 సిమ్ కార్డుల్ని పొందేందుకు అర్హత ఉంటుంది.
- ఎవరి సిమ్ కార్డు సేవలనైనా పూర్తిగా నిలిపివేస్తే.. 90 రోజుల వ్యవధి తర్వాతే ఆ నంబర్ మరొక వ్యక్తికి ఇస్తారు.
- కస్టమర్లు సిమ్ కార్డుల్ని కొనుగోలు చేసే సమయంలో.. ఆధార్ స్కానింగ్ సహా డెమోగ్రాఫీ డేటా సేకరిస్తారు.
- డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.
- కొత్త నిబంధనలను అంగీకరించి సిమ్ విక్రయాలు జరిపేందుకు.. డీలర్లు నవంబర్ 30 లోపు నమోదు చేసుకోవాలి.
మీ ఫోన్లో ఈ సీక్రెట్ కోడ్స్ ఎంటర్ చేస్తే - మీరు ఊహించని సమాచారం వస్తుంది!