తెలంగాణ

telangana

ETV Bharat / business

SVB పతనంతో టెక్​ మార్కెట్లు కుదేలు.. భారతీయ స్టార్టప్​లపై ప్రభావం! - సిలికాన్ వ్యాలీ బ్యాంక్​ మూసివేత

గత కొన్ని సంవత్సరాలుగా అంకుర సంస్థలకు ప్రధానంగా సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ నిధులు సమకూర్చేది. ఇప్పుడు బ్యాంక్‌ పతనం భారత స్టార్టప్‌ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని.. నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఉదంతం ఒక్క రాత్రిలోనే దేశ అంకుర పరిశ్రమలో.. తీవ్ర అస్థిరతను నింపిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Silicon Valley Bank crisis
Silicon Valley Bank crisis

By

Published : Mar 13, 2023, 9:58 AM IST

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(SVB) పతనం భారత అంకుర పరిశ్రమలో తీవ్ర అస్థిరతను నింపిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అతి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నప్పటికీ.. స్టార్టప్‌ రంగానికి ఇది పెద్ద దెబ్బగా చెబుతున్నారు. భారత స్టార్టప్‌ పరిశ్రమకు SVB మద్దతుగా నిలిచిందని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ ఆశు గార్గ్ తెలిపారు. బ్యాంకింగ్‌ సేవలను కూడా అందించిందని వివరించారు. అమెరికాలో వ్యాపారం చేయాలనుకుంటున్న భారత అంకుర సంస్థల్లో చాలా వరకు ఈ బ్యాంకు సేవలనే వినియోగించుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. భారత బ్యాంకులతో కలిసి పనిచేయడానికి SVB ముందుకు రావడమే అందుకు కారణమన్నారు. అక్కడి చాలా బ్యాంకులు విదేశీ కస్టమర్లతో పనిచేయడానికి సుముఖంగాలేవని ఆయన గుర్తుచేశారు. SVB మాత్రం అమెరికా ఉద్యోగులు లేని అంకురాలకు సైతం తమ సేవలను విస్తరించిందని గార్గ్‌ తెలిపారు. అంకురాలకు సహాయం అందించే SVB పతనం.. భారత అంకుర సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని గార్గ్‌ వివరించారు.

సిలికాన్‌ వ్యాలీలో కొన్నేళ్లుగా చాలా వరకు స్టార్టప్‌లు, టెక్‌ పరిశ్రమలు SVB వైపే మొగ్గుచూపాయి. అంకుర సంస్థల పనితీరును SVB బాగా అర్థం చేసుకుందని.. వాటితో ఎలా డీల్‌ చేయాలో తెలిసి ఉండడమే అందుకు కారణమని గార్గ్‌ చెప్పారు. సిలికాన్‌ వ్యాలీలో ప్రతి మూడు స్టార్టప్‌లలో ఒకటి భారతీయ అమెరికన్‌లు స్థాపించినదేనని.. ఓ ప్రముఖ సంస్థ అంచనా వేసింది. ఆ అంకురాలన్నీ వచ్చే వారం రోజుల్లో తీవ్ర సంక్షోభం ఎదుర్కోనున్నాయని తెలిపింది. వీటిలో చాలా వరకు ఉద్యోగుల వేతనాలు సహా ఇతర అత్యవసర చెల్లింపులు కూడా చేయలేకపోవచ్చని చెబుతోంది. అమెరికాలో కనీసం ఆఫీసు, ఒక్క ఉద్యోగి కూడా లేని స్టార్టప్‌లు సైతం SVBలో ఖాతాలు తెరిచాయి. ఈ నేపథ్యంలో ఈ బ్యాంక్ పతనంవల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

SVBని కొనేందుకు సిద్ధమైన మస్క్..!
ఆర్థిక సంక్షోభం కారణంగా మూసివేసిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(SVB)పై ట్విట్టర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తనదైన శైలిలో స్పందించారు. సంక్షోభంలో ఉన్న SVBను తాను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎలాన్​ మస్క్‌ వెల్లడించారు. SVBని డిజిటల్‌ బ్యాంక్‌గా మారుస్తానని అన్నారు. SVBని ట్విట్టర్‌ కొనుగోలు చేసి డిజిటల్‌ బ్యాంక్‌గా మార్చాలని ఎలక్ర్టానిక్‌ కంపెనీ రెజర్‌ సీఈవో మిన్‌ లియోంగ్‌ టన్‌ చేసిన ట్వీట్‌కు బదులిస్తూ మస్క్ ఈ ట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంకును మూసివేస్తున్నట్లు.. ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయడం.

ABOUT THE AUTHOR

...view details