తెలంగాణ

telangana

ETV Bharat / business

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్.. 18 నిమిషాల్లో 80% ఛార్జ్.. 631కి.మీ ప్రయాణం!

హ్యుందాయ్ 'అయానిక్ 5' SUVని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఆవిష్కరించారు. సింగిల్ ఛార్జ్​తో ఈ కారులో 631 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చని హ్యుందాయ్ కంపెనీ చెబుతోంది. 18 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుందని తెలిపింది. మరిన్ని ఫీచర్లు ఇలా..

hyundai-ioniq 5-car
hyundai-ioniq 5-car

By

Published : Jan 11, 2023, 7:54 PM IST

అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది హ్యుందాయ్ మోటార్స్. 'హ్యుందాయ్ అయానిక్ 5' ఎస్​యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. నోయిడాలో జరుగుతున్న 2023 ఆటో ఎక్స్​పోలో ఈ కారును ప్రదర్శించింది. బాలీవుడ్ బాద్​షా, హ్యుందాయ్ ప్రచారకర్త షారుక్ ఖాన్ ఈ కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన సూపర్​హిట్ చిత్రం 'దిల్​వాలే దుల్హానియా లే జాయేంగే'లోని 'తుజే దేఖా తో యే జానా సనమ్' పాటను ఆలపించారు.

హ్యుందాయ్ 'ఐయానిక్ 5'
హ్యుందాయ్ 'ఐయానిక్ 5'

అయానిక్ 5 కాన్సెప్ట్ మోడల్​ను 2019లోనే ప్రదర్శించింది హ్యుందాయ్. కాన్సెప్ట్ మోడల్​ కన్నా మరింత ఆకర్షణీయంగా దీన్ని తీర్చిదిద్దింది. అయానిక్ 5ని ఒకసారి ఛార్జ్ చేస్తే.. నిరంతరాయంగా 631 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చని కంపెనీ చెబుతోంది. గ్రావిటీ గోల్డ్ మాట్, ఆప్టిక్ వైట్, మిడ్​నైట్ బ్లాక్ రంగుల్లో ఈ వాహనం అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ 'ఐయానిక్ 5'
హ్యుందాయ్ 'ఐయానిక్ 5'

డిజైన్, ఫీచర్లు
'ఈ-జీఎంపీ' ప్లాట్​ఫాంపై ఐయానిక్ 5ను రూపొందించారు. ఇదే ప్లాట్​ఫాంపై తయారైన కియా ఈవీ6 వాహనం ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంది. విశాలమైన హెడ్​లైట్లు, 20 అంగుళాల ఏరో-ఆప్టిమైజ్డ్ అలాయ్ చక్రాలు ఐయానిక్​లో ఉన్నాయి.

హ్యుందాయ్ 'ఐయానిక్ 5'
  • డాష్​బోర్డ్​పై 12.5 అంగుళాల ఇన్​స్ట్రూమెంట్ క్లస్టర్, టచ్​స్క్రీన్ సిస్టమ్
  • హెడ్స్ అప్ డిస్​ప్లే
  • ఏడీఏఎస్ సేఫ్టీ టెక్నాలజీ
  • ల్యాప్​టాప్​లు, మొబైల్స్ రీఛార్జ్ కోసం 3.6 కేవీ అవుట్​పుట్
  • 72.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్
  • 800 వోల్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్
  • 18 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80శాతం ఛార్జింగ్

గతేడాది డిసెంబర్​ 21న ఈ కార్ల బుకింగ్స్ ప్రారంభించింది హ్యుందాయ్. రూ.లక్ష పెట్టి బుక్ చేసుకోవచ్చు. తొలి 500 మంది వినియోగదారులకే ఈ అవకాశం. కారు ధరను (ఎక్స్​షోరూం) రూ.44.95 లక్షలుగా నిర్ణయించింది హ్యుందాయ్. ఈ కారుతో పాటు 'అయానిక్ 6' మోడల్​ను సైతం ఇదే ఎక్స్​పోలో ప్రదర్శించిందీ సంస్థ. ఇది ఐరోపా, ఉత్తర అమెరికా మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

కారును ఆవిష్కరిస్తున్న షారుక్

ABOUT THE AUTHOR

...view details