తెలంగాణ

telangana

ETV Bharat / business

మాల్యాకు సుప్రీం షాక్.. 4నెలల శిక్ష.. రూ.317 కోట్ల డిపాజిట్​కు ఆదేశం - పోర్చుగల్‌కు భారత ప్రభుత్వం హామీ

Vijay mallya news: రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్​ మాల్యాకు కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసింది. నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Setback for Vijay Mallya
Setback for Vijay Mallya

By

Published : Jul 11, 2022, 10:57 AM IST

Updated : Jul 11, 2022, 12:03 PM IST

Vijay mallya news: దేశంలో రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి పరారీలో ఉన్న 'కింగ్‌ఫిషర్‌' యజమాని విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టు.. 2017 నాటి కోర్టు ధిక్కార కేసులో శిక్ష విధించింది. మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ జస్టిస్‌ యు.యు.లలిత్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. రూ.2వేల జరిమానా విధించింది. మరోవైపు, 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ.317 కోట్లు) డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మాల్యా తన బ్రిటిష్‌ సంస్థ డియాగోను విక్రయించగా వచ్చిన 40 మిలియన్‌ డాలర్లను (భారత కరెన్సీలో దాదాపు రూ.317కోట్లు) తన పిల్లలకు బదిలీ చేశారని 2017లో బ్యాంకుల కన్సార్షియం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ సమాచారాన్ని న్యాయస్థానం వద్ద దాచారని, ఇది పూర్తిగా కోర్టు ఆదేశాల ఉల్లంఘనే అని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్‌పై అదే ఏడాది విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మాల్యా న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారని తేల్చింది. అతనిపై ధిక్కరణ చర్యలు తీసుకుంటామని తెలిపింది.

అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ మాల్యా పిటిషన్‌ దాఖలు చేయగా.. 2020 ఆగస్టులో కోర్టు దాన్ని తిరస్కరించింది. ఆయన కోర్టు ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. అయితే, ఎన్ని సార్లు ఆదేశాలు జారీ చేసిన మాల్యా కోర్టుకు హాజరుకాకపోవడంతో మరోసారి విచారించిన న్యాయస్థానం.. ఈ ఏడాది మార్చి 10న తీర్పును రిజర్వ్‌లో పెట్టి తాజాగా వెల్లడించింది.

లండన్​లో మకాం!
రూ.9వేల కోట్ల రుణ ఎగవేత ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిపోయిన మాల్యా.. 2016 నుంచి యూకేలో ఉంటున్నారు. ఆయనను భారత్‌కు అప్పగించే విషయమై అక్కడి న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారు.

Last Updated : Jul 11, 2022, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details