తెలంగాణ

telangana

ETV Bharat / business

September Bank Holidays 2023 : సెప్టెంబరు నెలలో బ్యాంక్​ సెలవుల పూర్తి లిస్ట్​ ఇదే! - september bank holidays 2023

September Bank Holidays 2023 : సెప్టెంబరు నెలలో దాదాపు సగం రోజుల పాటు దేశంలోని బ్యాంకులు పనిచేయవు. అందుకు సంబంధించి సెలవుల పూర్తి జాబితాను రిజర్వ్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా ఇటీవలే విడుదల చేసింది. మరి ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

September Bank Holidays 2023
September Bank Holidays 2023

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 12:20 PM IST

Updated : Aug 26, 2023, 2:39 PM IST

September Bank Holidays 2023 : బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక. సెప్టెంబరు నెలలో బ్యాంకులకు 16 రోజుల పాటు సెలవులు (అన్ని రాష్ట్రాల్లో కలిపి) ఉండనున్నాయి. వినియోగదారులు ముందస్తుగా గమనించి బ్యాంక్‌ పనులను ప్లాన్‌ వేసుకోవడం మంచిది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్​బీఐ) ప్రతి నెలా.. బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగా సెప్టెంబర్​ నెలలోని సెలవుల జాబితాను కూడా ప్రకటించింది.

Holidays In September 2023 India : ప్రతి నెలా పండుగలు, వారాంతాల్లో దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే ఆర్​బీఐ విడుదల చేసిన జాబితాలో బ్యాంకుల సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండుగలు, ఇతర కార్యక్రమాలను అనుసరించి సెలవులు ఉంటాయని గమనించాలి. మరి సెప్టెంబరు నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

How Many Bank Holidays in 2023

  • సెప్టెంబర్​ 3 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • సెప్టెంబర్​ 6 (బుధవారం): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులు పనిచేయవు.
  • సెప్టెంబర్​ 7 (గురువారం): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • సెప్టెంబర్​ 9 ( రెండో శనివారం): దేశంలో బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • సెప్టెంబర్​ 10 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
  • సెప్టెంబర్​ 17 (ఆదివారం): దేశంలోని అన్ని బ్యాంక్​లకు సెలవు.
  • సెప్టెంబర్​ 18 (సోమవారం): వినాయక చవితి సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • సెప్టెంబర్​ 19 (మంగళవారం): వినాయక చవితి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
  • సెప్టెంబర్​ 20 (బుధవారం): నువాఖాయీ పురస్కరించుకుని కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
  • సెప్టెంబర్​ 22 (శుక్రవారం):శ్రీ నారాయణ గురు సమాథి చెందిన రోజు సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడి ఉంటాయి.
  • సెప్టెంబర్​ 23 (నాలుగో శనివారం): దేశంలో బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • సెప్టెంబర్​ 24 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
  • సెప్టెంబర్​ 25 (సోమవారం):శ్రీమంత్​ శంకర్​ దేవ్ జయంతి సందర్భంగా అసోంలోని గువాహతి బ్యాంకులకు సెలవు.
  • సెప్టెంబర్​ 27 (బుధవారం): మిలాద్​-ఇ-షరీఫ్​ పురస్కరించుకుని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
  • సెప్టెంబర్​ 28 (గురువారం): ఈద్​-ఇ-మిలాద్​ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • సెప్టెంబర్​ 29 (శుక్రవారం): ఈద్​-ఇ-మిలాద్​-ఉన్-నబీ సందర్భంగా గ్యాంగ్​టక్​, జమ్ము, శ్రీనగర్​లోని బ్యాంకులకు సెలవు.

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
List Of Holidays In September 2023 :బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు విత్​డ్రా చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషీన్ల ద్వారా మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు.

Last Updated : Aug 26, 2023, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details