అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా లాభపడింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 110 పాయింట్లు లాభపడి 41,684 వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 28 పాయింట్ల వృద్ధితో 12,273 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లోనివి..
ఐటీసీ సుమారు 1.5 శాతం మేర లాభపడింది. మహీంద్ర అండ్ మహీంద్ర, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, టీసీఎస్, మారుతి, సన్ ఫార్మా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరంభ ట్రేడింగ్‌లో సుమారు 0.76 శాతం మేర నష్టపోయింది. ఎస్బీఐ, హెచ్‌యూఎల్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోలిస్తే.. 2 పైసలు బలపడి రూ.71.32 వద్ద కొనసాగుతోంది.
ఇదీ చూడండి: లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రణాళిక వేసుకోండి!