Score Big Savings on ICC World Cup 2023 Travel : క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 క్రికెట్ మహా సమరానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. భారత్ వేదికగా అక్టోబర్ 5న మొదలయ్యే.. వన్డే ప్రపంచకప్-2023కు రంగం సిద్ధమైంది. దీంతో.. విమాన, హోటల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. క్రికెట్ లవర్స్ కోసం కొన్ని ట్రావెల్ సంస్థలు ఫ్లైట్, హోటల్స్ బుకింగ్స్‌కు సంబంధించి డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం..
World Cup 2023 Online Ticket : క్రికెట్ లవర్స్ గెట్ రెడీ.. వరల్డ్ కప్ టికెట్లు అప్పటి నుంచే! వారికి స్పెషల్ ఆఫర్
క్రికెట్ ప్రపంచ కప్ కోసం.. యాత్రా డాట్ కామ్(Yatra.com) క్రికెట్ అభిమానులకు ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. బుకింగ్స్ కోసం ప్రోమోకోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రోమోకోడ్ ఉపయోగించడం ద్వారా అభిమానులు దేశీయ విమానాలపై రూ.599 తగ్గింపును పొందవచ్చని.. యాత్రా డాట్ కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. హోటల్ బుకింగ్స్‌పై 18 శాతం తగ్గింపును పొందడానికి.. కూడా అదే ప్రోమోకోడ్‌ను ఉపయోగించవచ్చని తెలిపింది. యాత్రా.కామ్ ప్రోమోకోడ్ YTWC23. ఈ ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్.. ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా అందిస్తోంది. దీని కింద ఒక్కొక్కరు రూ. 15వేల 999 వరకు ఆదా చేసుకోవచ్చు.
మరో ట్రావెల్ ఏజెన్సీ ఇండియన్ ఈగిల్ కూడా క్రికెట్ లవర్స్ కోసం కొన్ని ఆఫర్లు ప్రకటించింది. ఇతర దేశాల నుంచి భారత్ రావాలనుకునేవారు.. అంతర్జాతీయ విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకునేటప్పుడు.. కూపన్ కోడ్ WORLDCUPTD25ని ఉపయోగించవచ్చని తెలిపింది. దీనివల్ల $25 తగ్గింపు పొందే అవకాశం కల్పించింది. అంటే.. ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 2వేల రూపాయలు ఆఫర్ పొందవచ్చు. అయితే.. ఈ ఆఫర్ సెప్టెంబరు 10 నుంచి అక్టోబర్ 10 మధ్య చేసిన బుకింగ్‌లకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది.
ఇక.. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌కు వస్తే.. జూన్ 27న ఐసీసీ ప్రపంచకప్ 2023 షెడ్యూల్ విడుదల అయ్యింది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈ ట్రోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబరు 5 నుంచి 2023 ప్రపంచకప్ మొదలుకానుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరుగుతుంది. గత ఫైనల్లో తలపడిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే..
- టీమిండియా vs ఆస్ట్రేలియా, అక్టోబర్ 8, చెన్నై.
- టీమిండియా vs ఆఫ్ఘనిస్తాన్, అక్టోబర్ 11, ఢిల్లీ.
- టీమిండియా vs పాకిస్థాన్, 15 అక్టోబర్, అహ్మదాబాద్.
- టీమిండియా v బంగ్లాదేశ్, అక్టోబర్ 19, పూణే.
- టీమిండియా vs న్యూజిలాండ్, అక్టోబర్ 22, ధర్మశాల.
- టీమిండియా vs ఇంగ్లండ్, అక్టోబర్ 29, లక్నో.
- టీమిండియా vs శ్రీలంక, నవంబర్ 2, ముంబై.
- టీమిండియా vs సౌతాఫ్రికా, నవంబర్ 5, కోల్‌కతా.
- టీమిండియా vs నెదర్లాండ్స్, నవంబర్ 11, బెంగళూరు.