తెలంగాణ

telangana

ETV Bharat / business

SBI Wecare Special Fixed Deposit Scheme: ఎస్​బీఐ నుంచి సూపర్ స్కీం.. కొద్దిరోజులే ఛాన్స్! - How to Open SBI WECARE FD Scheme

SBI Wecare Special Fixed Deposit Scheme for Senior Citizens: ప్రస్తుత కాలంలో.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి సేవింగ్స్ ఆప్షన్లుగా మారాయి. ఇతర సేవింగ్ స్కీమ్స్‌తో పోల్చిచూస్తే ఇందులో మంచి వడ్డీ రేట్లు ఉండటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఓ స్కీం అందుబాటులోకి తెచ్చింది. మరి.. ఆ స్కీం ఏంటి..? దానికి ఎవరు అర్హులు..? గడువు ఎప్పటి వరకు ఉంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

SBI Fixed Deposit Scheme
SBI Wecare Special Fixed Deposit Scheme

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 5:14 PM IST

SBI Wecare Special Fixed Deposit Scheme for Senior Citizen: "ఫిక్స్‌డ్ డిపాజిట్.." ప్రజాదరణ పొందిన సురక్షిత ఇన్వెస్ట్​మెంట్​ స్కీమ్స్​లో ఒకటి. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. మీరు పెట్టిన మొత్తానికి అధిక మొత్తంలో వడ్డీ వస్తుంది. సాధారణ పౌరుల కన్నా సీనియర్ సిటిజెన్స్​కు ఎక్కువ శాతం వడ్డీ వస్తుంది. కొన్ని బ్యాంకులు కేవలం సీనియర్ సిటిజెన్స్ కోసమే ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను ప్రారంభించాయి. ఈ కోవలోకి చెందుతుంది.. భారతీయ స్టేట్ బ్యాంక్ తెచ్చిన తాజా స్కీమ్. దాని పేరే.. ఎస్‌బీఐ వీకేర్. ప్రత్యేకంగా.. సీనియర్ సిటిజెన్స్ కోసమే స్కీమ్‌ రూపొందించింది.

How to Generate SBI Debit Card PIN : ఎస్​బీఐ డెబిట్ కార్డు.. పిన్ ఎలా సెట్ చేయాలో తెలుసా..?

SBI Wecare Senior Citizen Fixed Deposit Scheme Full Details: మే 2020లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. SBI 'WE CARE' సీనియర్ సిటిజన్స్ టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. దీని గడువు తొలుత సెప్టెంబర్ 2020 వరకు ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని చాలా సార్లు పొడిగించారు. అలా ఈ సంవత్సరం మార్చి 31వ తేదీకి ఈ పథకం గడువు ముగుస్తుండగా.. దానిని జూన్​ 30కు పొడిగించారు. మళ్లీ దాన్ని ఈ సెప్టెంబర్​ 30 వరకు పొడిగించారు.

ఎస్బీఐ లక్ష్యం ఇదే..:సీనియర్ సిటిజన్స్​కు అధిక రాబడి అందించడమే లక్ష్యంగా ఎస్‌బీఐ వీ కేర్(SBI WECARE) డిపాజిట్ పథకాన్ని అందిస్తున్నట్లు బ్యాంక్ తన అధికారిక వెబ్ సైట్​లో తెలిపింది. సీనియర్ సిటీజన్స్​తో తమ బంధాన్ని మరి కొన్ని సంవత్సరాలు కొనసాగించేందుకే దీనిని గడువు పెంచుతున్నట్లు చెప్పింది.

How to Unblock Your SBI ATM Card : SBI ATM కార్డును.. అన్‌బ్లాక్ ఎలా చేయాలి..?

అధిక ప్రయోజనాలు..

Benefits of SBI WECARE FD Scheme:ఈ ప్రత్యేక పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోంది ఎస్పీఐ. రెగ్యులర్‌గా ఇతర ఎఫ్‌డీ పథకాలపై సీనియర్ సిటిజన్లకు అందించే అదనపు 50 బేసిస్ పాయింట్లు కాకుండా.. మరో 50 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీ ఈ స్కీమ్ ద్వారా అందుతుంది. అంటే రెగ్యులర్ కస్టమర్ల కన్నా 100 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ పొందవచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది.

స్కీమ్‌కు అర్హులు వీరే..

Eligibility:SBI WeCare కింద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ చేసుకొనే అవకాశం 60 సంవత్సరాలు దాటిన ఇండియన్‌ సిటిజన్స్‌కు మాత్రమే ఉంది. ఇది డొమెస్టిక్‌ టర్మ్‌ డిపాజిట్‌ పథకం కావడంతో ఎన్‌ఆర్​ఐలు అకౌంట్‌ ఓపెన్‌ చేసుకొనే అవకాశం లేదు. మనీ సెక్యూరిటీ మాత్రమే కోరుకొంటే సాధారణ ఎఫ్‌డీలు మంచివే. సీనియర్‌ సిటిజన్లు, రిస్కు ఎక్కువగా ఉన్న వర్గాలు కూడా ఈ డిపాజిట్లు చేయవచ్చు. కరోనా కాలంలో 60 ఏళ్లు కంప్లీట్​ అయిన సీనియర్‌ సిటిజన్ల కోసం చాలా బ్యాంకులు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ ప్రారంభించాయి.

ఎలా ప్రారంభించాలి..?

How to Open SBI WECARE FD Scheme:ఎస్‌బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను నెట్ బ్యాంకింగ్ లేదా నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి కూడా తీసుకోవచ్చు. అలాగే స్టేట్ బ్యాంక్ YONO యాప్ ద్వారా స్కీమ్‌లో జాయిన్ కావచ్చు.

How to Use SBI Card Pay : వినియోగదారులకు SBI గుడ్​న్యూస్.. ఇక కార్డు లేకుండానే షాపింగ్..!

How to Setup and Login to SBI YONO App : మీరు ఎస్​బీఐ కస్టమరా..? మరి YONO యాప్ వాడుతున్నారా.. లేదా??

ABOUT THE AUTHOR

...view details