తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​బీఐ గుడ్​న్యూస్.. ఆ డిపాజిట్ పథకం మరోసారి పొడగింపు

సీనియర్ సిటిజన్లకు ఎస్​బీఐ గుడ్​న్యూస్ చెప్పింది. ఎస్​బీఐ వీ కేర్ పథకం గడువును మరోసారి పొడగిస్తున్నట్లు తెలిపింది. 2023 మార్చి 31 వ‌ర‌కు పథకం కొనసాగుతుందని ప్రకటించింది.

sbi wecare deposit
sbi wecare deposit

By

Published : Sep 19, 2022, 7:30 PM IST

SBI WeCare deposit : దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్లకు గుడ్​న్యూస్ చెప్పింది. ఎస్​బీఐ అందిస్తున్న ప్రత్యేక ఫిక్స్​డ్ డిపాజిట్ పథకంపై కీలక ప్రకటన చేసింది. సీనియర్ సిటిజన్ల కోసం అందిస్తున్న ఎస్​బీఐ వీ కేర్ పథకం గడువును పొడగిస్తున్నట్లు తెలిపింది. ఈ టర్మ్ డిపాజిట్ స్కీమ్​ను ఎస్​బీఐ.. 2020 మేలో ప్రారంభించింది. 2020 సెప్టెంబ‌రు వ‌ర‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కం అమ‌ల్లో ఉంటుందని తొలుత‌ వెల్లడించింది. అయితే, కొవిడ్‌- 19 కార‌ణంగా ఈ ప‌థ‌కం గ‌డువును ప‌లుమార్లు పొడిగించుకుంటూ వ‌చ్చింది. తాజాగా మరోసారి పథకాన్ని పొడగించింది. 2023 మార్చి 31 వ‌ర‌కు గ‌డువు పొడిగిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఎస్‌బీఐ స్పెష‌ల్ ఎఫ్‌డీ తాజా వ‌డ్డీ రేట్లు..
ఈ ప‌థ‌కం ద్వారా ఎస్‌బీఐ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 30 బేసిస్ పాయింట్లు అద‌నంగా వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు సాధారణ ప్రజల కంటే 50 బేసిస్‌ పాయింట్ల అదనపు వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన సీనియర్‌ సిటిజన్లకు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించే వ‌డ్డీ రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అద‌న‌పు వ‌డ్డీ ఈ పథకం ద్వారా లభిస్తుంది. ప్ర‌స్తుతం, ఎస్‌బీఐ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 5 ఏళ్ల ఎఫ్‌డీపై 5.65 శాతం వ‌డ్డీ రేటు ఆఫ‌ర్ చేస్తుండ‌గా.. సీనియ‌ర్ సిటిజ‌న్ ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కంలో చేసిన డిపాజిట్ల‌కు 6.45 శాతం వ‌డ్డీ లభిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details