తెలంగాణ

telangana

ETV Bharat / business

SBI Salary Account Benefits : శాలరీ అకౌంట్​ ఓపెన్ చేయాలా?.. ఎస్​బీఐ అందిస్తున్న బెస్ట్ బెనిఫిట్స్​ ఇవే! - ఎస్​బీఐ శాలరీ అకౌంట్ ఇన్సూరెన్స్

SBI Salary Account Benefits In Telugu : మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా? శాలరీ అకౌంట్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం ఎస్​బీఐ బెస్ట్ శాలరీ ప్యాకేజ్​ అకౌంట్లను అందిస్తోంది. వాటి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

SBI Salary Account Benefits
SBI Salary Package Account Benefits

By

Published : Aug 22, 2023, 3:27 PM IST

SBI Salary Account Benefits : బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు, వారిని దీర్ఘకాలంపాటు నిలుపుకునేందుకు అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగులు తమ బ్యాంకులో శాలరీ అకౌంట్స్​ ఓపెన్ చేసేలా ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఇందుకోసం ఉద్యోగులకు అనేక ప్రత్యేక సదుపాయాలను, ఇతర బెనిఫిట్స్​ను అందిస్తూ ఉంటాయి. స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా కూడా ఉద్యోగులకు ప్రత్యేక శాలరీ అకౌంట్​లను కల్పిస్తోంది. అంతే కాదు వీటి ద్వారా తమ కస్టమర్లకు చాలా బెనిఫిట్స్​ను, ప్రత్యేక సౌకర్యాలను అందిస్తోంది.

ఎస్​బీఐ శాలరీ ప్యాకేజ్​ అకౌంట్​ అంటే ఏమిటి?
SBI Salary Package Account :ఎస్​బీఐ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ అనేది ఉద్యోగులకు మాత్రమే కల్పిస్తున్న ఒక ప్రత్యేకమైన పొదుపు పథకం. దీని ద్వారా ఉద్యోగులకు ప్రత్యేకమైన బెనిఫిట్స్​, ఫీచర్స్​, సర్వీసెస్​ అందిస్తారు. అలాగే నెట్​బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్​ ఫెసిలిటీ కూడా కల్పిస్తారు. దీని ద్వారా ఉద్యోగులు తమ బ్యాంకింగ్ అవసరాలు తీర్చుకోవడం సహా, సమర్థవంతంగా ఆర్థిక నిర్వహణ చేసుకోవడానికి వీలవుతుంది.

ఎస్​బీఐ శాలరీ అకౌంట్​ ప్రయోజనాలు ఏమిటి?
SBI Salary Package Account Benefits : ఉద్యోగులు తాము ఎంచుకున్న ప్యాకేజీ ఆధారంగా వారికి వచ్చే బెనిఫిట్స్​, ఫీచర్స్​ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని కీలకమైన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

  • జీరో బ్యాలెన్స్ అకౌంట్​ ఓపెన్ చేసుకోవచ్చు.
  • నెలవారీ సగటు బ్యాలెన్స్​ ఛార్జీలు ఉండవు.
  • ఆటో స్వీప్​ సౌకర్యం (ఇది పూర్తిగా ఐచ్ఛికం)
  • ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన ఉచిత డెబిట్​ కార్డ్​
  • డిమాండ్​ డ్రాఫ్ట్​ జారీపై ఛార్జీలు మినహాయింపు
  • ఇండియాలోని అన్ని ఎస్​బీఐ, ఇతర బ్యాంక్​ ATMల్లో అపరిమిత​ లావాదేవీలు జరుపుకునే సౌకర్యం
  • నెలకు 25 చెక్​ లీవ్​ల వరకు మల్టీ సిటీ చెక్​ల జారీపై రుసుము మినహాయింపు
  • ఆల్​లైన్​ RTGS/ NEFT ఛార్జీల మినహాయింపు
  • కాంప్లిమెంటరీ పర్సనల్​/ ఎయిర్​ యాక్సిడెంటల్​ ఇన్సూరెన్స్​
  • తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత, గృహ, వాహన రుణాలు అందించడం
  • ఓవర్​ డ్రాఫ్ట్​ సౌకర్యం (అర్హతను అనుసరించి)
  • యాన్యువల్​ లాకర్​ రెంట్​ ఛార్జీలపై రాయితీ (అర్హతను అనుసరించి)
  • ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం (అర్హతను అనుసరించి)
  • వెల్త్ రిలేషన్​షిప్​ (అర్హతను అనుసరించి)

ఎస్​బీఐ అందిస్తున్న వివిధ రకాల శాలరీ ప్యాకేజ్​ అకౌంట్స్​
Different Types Of Salary Account Packages Offered by SBI :స్టేట్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా వివిధ రంగాల ఉద్యోగులకు అనుగుణంగా వేర్వేరు శాలరీ ప్యాకేజ్​ ఖాతాలను అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • సెంట్రల్​ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్​ (CGSP)
  • స్టేట్ గవర్నమెంట్​ శాలరీ ప్యాకేజ్​ (SGSP)
  • రైల్వే శాలరీ ప్యాకేజ్​ (RSP)
  • డిఫెన్స్​ శాలరీ ప్యాకేజ్​ (DSP)
  • సెంట్రల్​ ఆర్మ్​డ్​ పోలీస్​ శాలరీ ప్యాకేజ్​ (CAPSP)
  • పోలీస్​ శాలరీ ప్యాకేజ్​ (PSP)
  • ఇండియన్​ కోస్ట్ గార్డ్​ శాలరీ ప్యాకేజ్​ (ICGSP)
  • కార్పొరేట్​ శాలరీ ప్యాకేజ్ (CSP)
  • స్టార్ట్​-అప్​ శాలరీ ప్యాకేజ్​ అకౌంట్​ (SUSP)

ఎస్​బీఐ శాలరీ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి?
How To Open SBI Salary Account :ఒక వేళ మీరు ఎస్​బీఐ శాలరీ ప్యాకేజ్​ అకౌంట్​ తెరవాలంటే.. నేరుగా బ్యాంకు బ్రాంచ్​కు వెళ్లి సంప్రదించవచ్చు. లేదా ఆన్​లైన్​లో, యోనో యాప్​లో ఈ శాలరీ ప్యాకేజ్​ ఖాతాను తెరవవచ్చు.

ఎస్​బీఐ శాలరీ ఖాతా తెరిచేందుకు కావాల్సిన పత్రాలు
SBI Salary Package Account Opening Documents :

  • పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటోగ్రాఫ్​
  • పాన్​కార్డ్​ కాపీ
  • ఆర్​బీఐ అనుమతించిన ప్రభుత్వ గుర్తింపు పత్రం (ఆధార్​, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి)
  • ఎంప్లాయిమెంట్​/ సర్వీస్​ సర్టిఫికేట్​
  • లేటెస్ట్ శాలరీ స్లిప్​

నోట్​ : ఎస్​బీఐ ఉమ్మడి ఖాతా విషయంలో.. దరఖాస్తుదారులు అందరూ తమ ఐడీ, చిరునామా పత్రాలను అందించాల్సి ఉంటుంది.

సేవింగ్స్​ అకౌంట్​ను.. శాలరీ అకౌంట్​గా మార్చవచ్చా?
ఎస్​బీఐలోని సాధారణ పొదుపు ఖాతాను కచ్చితంగా శాలరీ అకౌంట్​గా మార్చడానికి వీలవుతుంది. దీని కోసం మీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఎంప్లాయిమెంట్​ ప్రూఫ్​, శాలరీ స్లిప్​ లేదా సర్వీస్​ సర్టిఫికేట్​ను సమర్పించాల్సి ఉంటుంది.

అకస్మాత్తుగా మీ జీతం ఆగిపోతే!
కొన్ని సార్లు అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో నెలవారీగా శాలరీ అకౌంట్​లో జీతం డబ్బులు జమ కావు. ఇలా వరుసగా మూడు నెలలపాటు జీతం జమకాకపోతే.. అప్పుడు ఆ ఖాతాను ఆటోమేటిక్​గా సాధారణ సేవింగ్స్​ అకౌంట్​గా మార్చేస్తారు. అలాగే అప్పటి వరకు అందిస్తున్న స్పెషల్ ఫీచర్లను కూడా నిలిపివేస్తారు. నిబంధనల ప్రకారం, సాధారణ పొదుపు ఖాతాలపై విధించే రుసుములు కూడా విధిస్తారు.

లాకర్ ఫెసిలిటీ సంగతేంటి?
ఎస్​బీఐ శాలరీ ప్యాకేజ్​ అకౌంట్​ ఉన్నవారికి.. వారి అర్హతను అనుసరించి లాకర్​ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే వార్షిక లాకర్ రెంట్​లో 50 శాతం వరకు కన్సెషన్​ (తగ్గింపు) కూడా లభిస్తుంది!

నెలకు ఎన్ని ఫ్రీ డ్రాఫ్ట్స్​ జారీ చేయవచ్చు!
SBI Over Draft Charges : శాలరీ అకౌంట్​ హోల్డర్స్​.. నెలలో ఎంత మొత్తానికైనా డ్రాఫ్ట్ జారీ చేయవచ్చు. అలాగే ఎన్ని సార్లు అయినా డ్రాఫ్ట్​లు జారీ చేయవచ్చు. వీటిపై ఎలాంటి పరిమితి లేదు. అలాగే వీటిపై ఎలాంటి ఇస్యూయెన్స్​ ఛార్జీలు కూడా విధించరు.

ఏటీఎం లావాదేవీల లిమిట్ ఎంత?
SBI ATM Transactions Charges : ఎస్​బీఐ శాలరీ అకౌంట్​ ఉన్న వాళ్లు భారతదేశంలోని అన్ని ఎస్​బీఐ ఏటీఎంల్లోనూ, ఇతర బ్యాంకు ఏటీఎంల్లోనూ అపరిమితమైన ఆర్థిక లావాదేవీలు జరపుకోవచ్చు. అదీ పూర్తి ఉచితంగా.

NEFT/ RTGS ఛార్జీలు విధిస్తారా?
ఎస్​బీఐ శాలరీ అకౌంట్​ హోల్డర్స్​ ఆన్​లైన్​లో చేసే లావాదేవీలపై ఎలాంటి NEFT/ RTGS ఛార్జీలు ఉండవు.

ఇన్సూరెన్స్ ఇస్తారా?
SBI Salary Package Account Insurance Benefits : ఎస్​బీఐలో శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఓపెన్​ చేసినవారికి.. కాంప్లిమెంటరీగా వ్యక్తిగత ప్రమాద బీమా (PAI), ఎయిర్ యాక్సిడెంట్​ ఇన్సూరెన్స్ (AAI) అందిస్తారు. శాలరీ అకౌంట్ టైప్​, వేరియంట్​ను అనుసరించి ఈ బీమా కవరేజీ మొత్తం మారుతూ ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details