తెలంగాణ

telangana

ETV Bharat / business

SBI RD Vs Post Office RD.. రెండింట్లో ఏది బెటర్​ ఆప్షన్​? - రికరింగ్​ డిపాజిట్​ అంటే ఏమిటి

SBI RD Vs Post Office RD : మనం సంపాదించిన డబ్బును మదుపు చేసేందుకు అందుబాటులో ఉన్న బెస్ట్​ ఇన్వెస్ట్​మెంట్ స్కీమ్స్​లో ఆర్​డీ(రికరింగ్​ డిపాజిట్​) ఒక్కటి. ఎస్​బీఐ ఆర్​డీ , పోస్ట్​ ఆఫీస్ ఆర్​డీ రెండూ మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే ఈ ​రెండింటిలో ఏది బెస్ట్​ ఆప్షనో ఇప్పుడు చూద్దాం.

SBI RD VS Post Office RD Which Recurring Deposit Scheme Offers Better Interest Rates
SBI RD Vs Post Office RD Which Is Better

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 8:21 AM IST

SBI RD Vs Post Office RD : దేశంలో డబ్బును ఆదా చేసుకునేందుకు అనేక మార్గాలున్నాయి. కొందరు ఫిక్స్​డ్​ డిపాజిట్లలో జమ చేస్తే, మరికొందరు మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేస్తారు. అలాగే మరికొందరు ఏమాత్రం రిస్క్​ లేని పథకాల్లో మదుపు చేసేందుకు మొగ్గు చూపిస్తుంటారు. అలాంటి కోవలోనిదే రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్​​.

ప్రస్తుతం ఈ రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్​ను దేశంలో వివిధ బ్యాంకులతో పాటు ఇండియన్​ పోస్ట్​ ఆఫీసులు కూడా అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్​ ఎస్​బీఐ కూడా ఈ స్కీమ్​ను తమ కస్టమర్ల కోసం అందిస్తోంది. మరో వైపు ఇండియన్ పోస్ట్ కూడా ఆర్​డీ డిపాజిట్లను అందిస్తోంది. మరి ఎస్​బీఐ అందించే రికరింగ్​ డిపాజిట్​ వడ్డీ రేట్లు, తపాలా శాఖ ఆఫర్​ చేస్తున్న ఇంట్రెస్ట్​ రేట్స్​( Post Office RD Vs SBI RD )ను బేరీజు వేసుకుంటే.. ఏది బెటర్​ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

రికరింగ్​ డిపాజిట్​ అంటే ఏమిటి..?
What Is Recurring Deposit :రికరింగ్​ డిపాజిట్స్​ అనేవి ఓ ప్రత్యేకమైన టర్మ్​ డిపాజిట్లు. వీటి సేవలు దేశంలోని వివిధ బ్యాంకులతో పాటు పోస్ట్​ ఆఫీసుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా డిపాజిట్​ స్కీమ్స్​.. వినియోగదార్లు ప్రతినెలా నిర్దేశిత మొత్తాన్ని బ్యాంకులో లేదా తపాలా కార్యాలయంలో జమ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తాయి. ఫలితంగా ఆర్​డీ ఖాతాలు తెరచినవారు రెగ్యులర్​గా ఫిక్స్​డ్​ ఇంట్రెస్ట్​ రేట్​ పద్ధతిలో ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లు అనేవి బ్యాంకు, ఎన్​ఎఫ్​బీసీల నిబంధనలకు అనుగుణంగా మారుతుంటాయి.

ఉదాహరణకు..మీరు 10 సంవత్సరాల కాలవ్యవధితో ఏడాదికి రూ.20వేల ఫిక్స్​డ్​ అమౌంట్​తో రికరింగ్​ డిపాజిట్​ ఖాతాను తెరిచారనుకోండి. అప్పుడు మీరు ఎంచుకున్న సమయానికి(మెచ్యురిటీ) మొత్తం రూ.2,40,000లను ఆర్​డీలో జమచేస్తారు. దీనిపై మీకు 5శాతం వడ్డీ లభిస్తుంది. ఫలితంగా మెచ్యూరిటీ సమయానికి మీకు రూ.7,15,083 వడ్డీ వస్తుంది. అంటే టర్మ్​ ముగిసేసరికి మొత్తంగా రూ.31,15,083 లంప్సమ్​ను మీరు పొందవచ్చు.

ఎస్​బీఐ ఆర్​డీ స్కీమ్​..
SBI RD Scheme 2023 :ఎస్​బీఐ ప్రస్తుతం 1 నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధితో కూడిన రికరింగ్​ డిపాజిట్​ సర్వీసెస్​ను తమ వినియోగదారులకు అందిస్తుంది. ఈ పథకం కింద సీనియర్​ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీని ఆందిస్తోంది. మరి సాధారణ కస్టమర్లకు ఈ బ్యాంక్​ అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలిలా ఉన్నాయి.

1-2 సంవత్సరాలు 6.80 శాతం
2-3 సంవత్సరాలు 7.00 శాతం
3-4 సంవత్సరాలు 6.50 శాతం
5-10 సంవత్సరాలు 6.50 శాతం

ఎస్​బీఐ నిబంధనల ప్రకారం, ఈ పథకం కింద సీనియర్​ సిటిజన్లు అదనంగా 0.50 శాతం వడ్డీని అధికంగా పొందుతున్నారు. దీని ప్రకారం..

1-2 సంవత్సరాలు 7.30 శాతం
2-3 సంవత్సరాలు 7.50 శాతం
3-4 సంవత్సరాలు 7.00 శాతం
5-10 సంవత్సరాలు 7.00 శాతం

పోస్ట్​ ఆఫీస్​ ఆర్​డీ..!
ప్రస్తుతం దేశంలో తపాలా శాఖ(పోస్ట్​ ఆఫీస్​) అందిస్తున్న రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్​ కాలవ్యవధి గరిష్ఠంగా 5 సంవత్సరాలు మాత్రమే. అది కూడా ఈ పథకం కింద మదుపు చేసే డబ్బుకు స్థిరంగా ఒకే రకమైన వడ్డీ వస్తుంది. కాగా, ప్రస్తుతం పోస్ట్​ ఆఫీసులు చెల్లిస్తున్న వడ్డీ శాతం 6.5 శాతంగా ఉంది. అయితే బ్యాంకులు ముఖ్యంగా సీనియర్​ సిటిజన్​లకు అందిస్తున్న అదనపు వడ్డీ పద్ధతిని పోస్ట్​ ఆఫీసుల్లో గమనించలేము.

మరి ఏది బెస్ట్ ఆర్​డీ​..?
SBI RD Vs Post Office RD Which Is Better :రికరింగ్​ డిపాజిట్​ సేవలందిస్తున్న ఎస్​బీఐ, పోస్ట్​ ఆఫీసులతో పోలిస్తే.. ఎస్​బీఐ ఆర్​డీలను బెస్ట్​ ఆప్షన్​గా సూచిస్తున్నారు ఫైనాన్షియల్​ ఎక్స్​పర్ట్స్​. ఎందుకంటే ముఖ్యంగా సీనియర్​ సిటిజన్​లకు ఎస్​బీఐ ఆర్​డీలు సాధారణ కస్టమర్లకు ఇచ్చే వడ్డీకి అదనంగా 0.50 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇవి వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎంతో ఉపయోగపడనున్నాయి. చివరగా మీ ఆర్థిక సామర్థ్యంతో పాటు అవసరాలకు అనుగుణంగా ఏది బెస్ట్​ ఆప్షనో బేరీజు వేసుకొని ఇన్వెస్ట్​ చేస్తే సరిపోతుందంటున్నారు బ్యాంకింగ్​ నిపుణులు.

ABOUT THE AUTHOR

...view details