తెలంగాణ

telangana

ETV Bharat / business

క్యూ2లో దుమ్ములేపిన SBI.. రూ.13వేల కోట్ల లాభం.. భారీగా పెరిగిన ఆదాయం - ఎస్​బీఐ లేటెస్ట్ న్యూస్

SBI Q2 Results : రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది ఎస్​బీఐ. గతేడాది రూ.7,626 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన ఎస్​బీఐ.. ఈ ఏడాది 74 శాతం వృద్ధితో ఏకంగా రూ.13,265 కోట్ల లాభాన్ని సాధించింది.

SBI
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

By

Published : Nov 5, 2022, 7:22 PM IST

SBI Q2 Results : ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. గతేడాది రూ.7,626 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన ఎస్​బీఐ.. ఈ ఏడాది 74 శాతం వృద్ధితో ఏకంగా రూ.13,265 కోట్ల లాభాన్ని సాధించింది. మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం పెరగడం భారీ లాభాల నమోదుకు దోహదపడింది.

సెప్టెంబర్‌ 30 నాటికి ఎస్‌బీఐ డిపాజిట్లు రూ.41,90,255 కోట్లకు చేరగా ఇవి గతేడాదితో పోలిస్తే 10 శాతం మేర పెరిగాయి. నికర నిరర్ధక ఆస్తులు(ఎన్​పీఏ) సైతం.. 1.52 శాతం నుంచి 0.80 శాతానికి తగ్గినట్లు ఎస్‌బీఐ తెలిపింది. విలువ పరంగా రూ.2,699 కోట్ల నుంచి 2011 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. మరోవైపు, ఎస్‌బీఐ గ్రూప్‌ మొత్తం ఆదాయం సైతం రూ.1,01,143.26 కోట్ల నుంచి రూ.1,14,782 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంలో వడ్డీ ఆదాయం సైతం 13 శాతం వృద్ధితో రూ. 35,183 కోట్లకు పెరిగినట్లు ఎస్‌బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details