తెలంగాణ

telangana

ETV Bharat / business

SBI Results: తగ్గిన ఎస్​బీఐ లాభం.. ఆదాయంలోనూ..

SBI Results: 2022-23 తొలి త్రైమాసికంలో ఎస్​బీఐ నికర లాభం కాస్త తగ్గింది. ఏప్రిల్​-జూన్​ క్వార్టర్​లో రూ. 6,068 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం కూడా స్వల్పంగా తగ్గింది.

SBI net profit drops 7 pc to Rs 6,068 cr in Q1
SBI net profit drops 7 pc to Rs 6,068 cr in Q1

By

Published : Aug 6, 2022, 5:18 PM IST

SBI Results: ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్​బీఐ) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం స్టాండలోన్‌ పద్ధతిన రూ.6068 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.6504 కోట్లతో పోలిస్తే 7 శాతం తగ్గడం గమనార్హం.

బ్యాంక్‌ మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా క్షీణించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.77,347.17 కోట్లుగా నమోదు కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 74,998.57 కోట్లకు చేరినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎస్‌బీఐ పేర్కొంది. స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్​పీఏ) నిష్పత్తి 5.32 శాతం నుంచి 3.91 శాతానికి తగ్గగా.. స్థూల ఎన్‌పీఏలు సైతం 1.7 శాతం నుంచి 1.02 శాతానికి చేరినట్లు బ్యాంక్‌ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details