తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన ఎస్​బీఐ.. ఈఎంఐలు మరింత భారం - how SBI lending rate will affect your loans

SBI interest rates: భారత బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్‌బీఐ రుణ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్‌సీఎల్‌ఆర్‌ ఆధారిత వడ్డీ రేట్లను 10 బేసిస్‌ పాయింట్ల (0.1 శాతం) మేర పెంచింది.

SBI
దిగ్గజం

By

Published : Apr 19, 2022, 12:55 PM IST

Updated : Apr 19, 2022, 1:30 PM IST

SBI interest rates: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. రుణ రేట్లను స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎమ్‌సీఎల్‌ఆర్‌) ఆధారిత రుణ రేట్లను 10 బేసిస్‌ పాయింట్ల (0.1 శాతం) మేర పెంచినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. పెంచిన రేట్లు ఏప్రిల్​ 15 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తన వెబ్​సైట్​లో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఫలితంగా ఆయా రుణాల ఈఎంఐలు మరింత పెరగనున్నాయి. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణాలను తీసుకొని ఈఎంఐలుగా చెల్లిస్తున్న వారిపై ఈ భారం పడనుంది. అయితే ఎస్​బీఐ మాదిరిగా భవిష్యత్​లో మరిన్ని బ్యాంకులు రుణ రేట్లను పెంచుకునే అవకాశం ఉంది.

ఎంసీఎల్ఆర్​లో మార్పులు..

రుణ రేటు పెంపు వల్ల ఎంసీఎల్ఆర్​లో మార్పులు ఇలా ఉన్నాయి. ఓవర్‌నైట్, నెల, మూడు నెలల మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లు 6.65 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 శాతం నుంచి 7.05 శాతానికి ఎగబాకింది. ఏడాది ఎంసీఎల్ఆర్ ఇది వరకు 7 శాతం ఉండగా.. కానీ ఇప్పుడది 7.10 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ కూడా 7.2 శాతం నుంచి 7.3 శాతానికి పెరిగింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 7.3 నుంచి.. 7.4 శాతానికి చేరుకుంది.

ఇదీ చదవండి: క్రిప్టో కరెన్సీపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Last Updated : Apr 19, 2022, 1:30 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details