SBI Home Loan Offers in Telugu : పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గృహ రుణాలపై అదిరిపోయే వడ్డీ రాయితీలను అందజేయనున్నట్లు ప్రకటించింది. హోమ్‌లోన్‌పై దాదాపుగా 65 బేసిస్ పాయింట్లు (bps) వరకు డిస్కౌంట్ అందిస్తామని పేర్కొంది. అయితే ఈ రాయితీ అనేది పూర్తిగా సదరు రుణ గ్రహీత సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. 2023 డిసెంబర్ 31 వరకు ఈ హోమ్‌లోన్ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని వెల్లడించింది.
సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?
What Is CIBIL Score? :సిబిల్ స్కోర్ అన్నా, క్రెడిట్ స్కోర్ అన్నా రెండూ ఒక్కటే. సిబిల్ స్కోర్ అనేది మూడు అంకెలు గల ఒక ప్రత్యేక కొలమానం. ఇది ఒక వ్యక్తి రుణ చరిత్రను, అతని ఆర్థిక స్థితిగతులను తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ రేంజ్ అనేది 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది.
750 -800 సిబిల్ స్కోర్ ఉంటే?
750 TO 800 CIBIL Score :సిబిల్ స్కోర్ 750-800 లేదా అంత కంటే ఎక్కువ ఉంటే, 8.60 శాతం వడ్డీ రేటుతో హోమ్‌లోన్ మంజూరు చేస్తామని ఎస్బీఐ స్పష్టం చేసింది. అంటే ఈ బెస్ట్ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 55 bps మేరకు రాయితీ కల్పించనున్నట్లు స్పష్టం చేసింది.
700 - 749 సిబిల్ స్కోర్ ఉంటే?
700 TO 749 CIBIL Score :క్రెడిట్ స్కోర్ 700 నుంచి 749 మధ్యలో ఉంటే.. వారికి 65 bps మేరకు రాయితీ కల్పిస్తున్నట్లు ఎస్బీఐ స్పష్టం చేసింది. అంటే వీరికి 8.7 శాతం వడ్డీ రేటుతో గృహ రుణం అందిస్తుంది ఎస్బీఐ.
550 -699 సిబిల్ స్కోర్ ఉంటే?
550 TO 699 CIBIL Score :సిబిల్ స్కోర్ 550-699 మధ్య ఉన్నవారికి తాము ఎలాంటి వడ్డీ రాయితీలు కల్పించడం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. అయితే వీరికి 9.45 % నుంచి 9.65% వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని వెల్లడించింది.
మహిళా రుణగ్రహీతలకు స్పెషల్ ఆఫర్స్!
ఎస్బీఐ చేస్తున్న ఈ స్పెషల్ క్యాంపెయిన్‌లో మహిళా రుణ గ్రహీతలకు మరిన్ని మంచి రాయితీలు అందించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ప్రొడక్ట్ లెవల్లోనే వారికి వడ్డీ రాయితీలు అందిస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు లోన్-టు-వాల్యూ (LTV) అనేది 80 శాతం కంటే ఎక్కువ ఉన్నా.. లేదంటే 90 శాతం కన్నా తక్కువగా ఉన్నా కూడా.. 30 లక్షల వరకు హోమ్ లోన్‌పై 10 bps ప్రీమియం కొనసాగుతుంది.
సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉన్నా లేదా దానికి సమానంగా ఉన్నా కూడా.. MaxGain & రియాలిటీ లోన్లపై 5bps పాయింట్ల మేర రాయితీ అందిస్తామని ఎస్బీఐ స్పష్టం చేసింది.
ITR Refunds Big Update : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఐటీ రిఫండ్‌పై కీలక ప్రకటన!