తెలంగాణ

telangana

ETV Bharat / business

వినియోగదారులకు ఎస్​బీఐ గుడ్​న్యూస్​.. ఎఫ్​డీ వడ్డీ రేట్లు పెంపు - largest lender SBI

SBI Rates: వడ్డీ రేట్లపై ఇటీవల ఆర్​బీఐ ప్రకటన నేపథ్యంలో.. వినియోగదారులకు ఎస్​బీఐ శుభవార్త చెప్పింది. ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. సీనియర్​ సిటిజన్లకు దీనిపై 0.5 శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది.

SBI hikes deposit, lending rates
SBI hikes deposit, lending rates

By

Published : Jun 15, 2022, 9:30 AM IST

SBI Rates: రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా రెపో రేటును పెంచడంతో, రుణ రేట్లతో పాటు బ్యాంకులు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై(ఎఫ్​డీ) వడ్డీ రేట్లనూ పెంచడం ప్రారంభించాయి. స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఎఫ్​డీలపై వడ్డీని 0.20 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈనెల 14 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 211 రోజుల నుంచి ఏడాది వ్యవధి డిపాజిట్లపై వడ్డీ ఇప్పుడున్న 4.40 శాతం నుంచి 4.60 శాతానికి చేరింది. 1-2 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీ 5.30 శాతం, 2-3 ఏళ్ల డిపాజిట్లపై 5.35 శాతం వడ్డీ లభించనుంది. సీనియర్​ సిటిజన్లకు దీనిపై 0.5 శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది. దీంతోపాటు రూ.2 కోట్లపైబడిన డిపాజిట్లపై వడ్డీని 0.75 శాతం మేరకు పెంచింది.

  • రెపో ఆధారిత రుణాల రేటును (ఆర్​ఎల్​ఎల్​ఆర్​) 7.15 శాతానికి చేర్చినట్లు ఎస్​బీఐ ప్రకటించింది. నిధుల వ్యయ ఆధారిత రుణ రేట్లను(ఎంసీఎల్​ఆర్​) కూడా 0.20 శాతం పెంచుతున్నామని తెలిపింది. నేటి నుంచి ఇవి అమల్లోకి వస్తున్నాయి.
  • పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ 1-10 ఏళ్ల డిపాజిట్లపై 10-35 బేసిస్​ పాయింట్ల వడ్డీ రేటు పెంచింది.
  • రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.25 శాతం వరకు ఈనెల 15 నుంచి పెంచుతున్నట్లు ఐడీబీఐ బ్యాంక్​ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details