SBI General Insurance New Health Policy 2023 : ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఒక సరికొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. పాలసీదారు ఒక వేళ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసినప్పటికీ.. దానిని మరలా 'రీఫిల్' చేసుకోవచ్చు. 'మల్టిప్లైయర్' ఆప్షన్ ద్వారా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు 3 రెట్లు బీమా కవరేజ్‌ను కూడా పొందవచ్చు.
సూపర్ హెల్త్ పాలసీ
SBI General Insurance Refill Policy : ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ లాంఛ్ చేసిన ఈ సూపర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.. 27 ప్రామాణిక, 7 ఐచ్ఛిక బీమా కవరేజ్‌లను అందిస్తుంది. ముఖ్యంగా ఈ ఆరోగ్య బీమాలో నాలుగు రకాల ప్లాన్లు ఉన్నాయి. ఇవి రూ.3 లక్షల నుంచి రూ.2 కోట్ల రేంజ్లో ఉంటాయి. వీటిని పాలసీదారులు 1 నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధులతో (పాలసీ టెన్యూర్) ఎంచుకోవచ్చు.
బెస్ట్ ఫీచర్స్
SBI General Insurance Reinsurance Policy Features :
- ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తీసుకువచ్చిన ఈ ఫ్లాగ్షిప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో అనేక న్యూ-ఏజ్ ఫీచర్లు ఉన్నాయి. వాక్ హెల్తీ బినిఫిట్స్, వెల్నెస్ కవరేజ్ లాంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
- ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఈ ఆరోగ్య బీమా పాలసీ కోసం ఒక ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించింది. దీనిలోని లక్ష్యాలను పాలసీదారులు పూర్తి చేస్తే, రెన్యువల్ చేసేటప్పుడు.. మీరు కట్టాల్సిన ప్రీమియం అమౌంట్ కూడా 30 శాతం తగ్గుతుంది