SBI Fixed Deposit Rates 2023 : ఎస్బీఐ వీ కేర్ Vs అమృత్ కలశ్.. ఏది బెస్ట్ ఆప్షన్? - sbi interest rates 2023
SBI Fixed Deposit Rates 2023 : ఎస్బీఐ రెండు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఎస్బీఐ వీ కేర్', 'ఎస్బీఐ అమృత్ కలశ్' పేరుతో తీసుకొచ్చిన ఈ పొదుపు పథకాల్లో అధిక వడ్డీ రేట్లను కూడా అందిస్తోంది. మరి వీటి పూర్తి వివరాలు మనం కూడా తెలుసుకుందామా?
SBI fixed deposit rates 2023
By
Published : Aug 11, 2023, 1:52 PM IST
SBI Fixed Deposit Rates 2023 : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. రెండు పరిమిత కాల స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లను తీసుకొచ్చింది. వీటిలో 'ఎస్బీఐ అమృత్ కలశ్' పథకాన్ని ఆగస్టు 15లోపు సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. 'ఎస్బీఐ వీ కేర్' స్కీమ్‌లో 2023 సెప్టెంబర్ 30లోపు చేరాల్సి ఉంటుంది. మరి ఈ రెండు స్కీమ్స్‌లో ఏది బెటర్ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు చూద్దామా?
ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్స్ - వడ్డీ రేట్లు SBI FD Interest Rates 2023 :స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయవచ్చు. వీటిపై 3 శాతం నుంచి 7.1 శాతం వరకు వడ్డీ రేట్లు లభిస్తాయి. సాధారణంగా ఈ ఎఫ్‌డీల్లో పొదుపు చేసిన సీనియర్ సిటిజన్స్‌కు, మిగిలిన వారి కంటే 50 బేసిస్ పాయింట్లు వరకు అదనపు వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతమున్న ఎస్బీఐ వడ్డీ రేట్ల వివరాలు ఇప్పుడు చూాద్దాం..
ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్స్
వడ్డీ రేట్లు
7 రోజులు - 45 రోజులు
3%
46 రోజులు - 179 రోజులు
4.5%
180 రోజులు - 210 రోజులు
5.25%
211 రోజులు - ఒక సంవత్సరం లోపు
5.75%
1 సంవత్సరం - 2 సంవత్సరాలు లోపు
6.8 %
2 సంవత్సరాలు - 3 సంవత్సరాల లోపు
7%
3 సంవత్సరాలు - 5 సంవత్సరాల లోపు
6.5%
5 సంవత్సరాలు - 10 సంవత్సరాలు
6.5%
400 రోజులు (అమృత్ కలశ్ - స్పెషల్ స్కీమ్)
7.10%
అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ SBI Amrit Kalash Scheme Details :ఎస్బీఐ 2023 ఫిబ్రవరిలో 400 రోజుల వ్యవధి గల అమృత్ కలశ్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో పొదుపు చేసిన సీనియర్ సిటిజన్స్‌కు 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. మిగతా వారికి 7.1 శాతం వడ్డీ అందుతుంది. ఈ పథకంలో చేరడానికి ఆఖరు తేదీ 2023 ఆగస్టు 15.
SBI Amrit Kalash Scheme Benefits :ఆదాయపన్ను చట్టం ప్రకారం, ఈ అమృత్ కలశ్ స్కీమ్‌లో వచ్చిన ఆదాయంపై మూలం వద్ద టీడీఎస్ పన్ను కోత ఉంటుంది. రూ.2 కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. స్వల్పకాలిక లక్ష్యంతో మదుపు చేసేవారికి ఈ అమృత్ కలశ్ పథకం మంచి లాభసాటిగా ఉంటుంది. ఈ పథకంలో రుణ సదుపాయం కూడా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లోని డబ్బును ముందుగానే ఉపసంహరించుకోవచ్చు.
వీ కేర్ డిపాజిట్ స్కీమ్ SBI We care Scheme Details :ఎస్బీఐ.. సీనియర్ సిటిజన్స్ కోసం ఈ 'వీ కేర్' స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకంలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరిన సీనియర్ సిటిజన్స్‌కు 7.50 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. వాస్తవానికి ఈ పథకం గడువును ఎస్బీఐ మరోసారి పెంచింది. అందువల్ల ఈ స్కీమ్‌లో 2023 సెప్టెంబర్ 30లోగా చేరాల్సి ఉంటుంది. ఈ పథకంలో కొత్తవారు చేరవచ్చు. అలాగే ఇప్పటికే ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ పొందినవారు కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు.