SBI coins scam : భారతీయ స్టేట్ బ్యాంక్‌లో 'కాయిన్స్ స్కామ్'పై దర్యాప్తు చేపడుతోంది సీబీఐ. వేర్వేరు రాష్ట్రాల్లోని 25 చోట్ల గురువారం విస్తృత సోదాలు నిర్వహించింది.
రాజస్థాన్ కరౌలీలోని స్టేట్ బ్యాంక్ బ్రాంచ్‌కు చెందిన వాల్ట్‌ల నుంచి రూ.11కోట్లు విలువైన నాణేలు మాయమయ్యాయి. నగదు లెక్కల్లో తేడాలు ఉన్నాయన్న అనుమానంతో విచారణ చేపట్టగా 2021 ఆగస్టులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రూ.2కోట్లు విలువైన 3వేల కాయిన్ బ్యాగ్స్ మాత్రమే వాల్ట్‌లలో ఉండగా.. మిగిలినవన్నీ మాయమయ్యాయి. తర్వాత ఈ వ్యవహారం రాజస్థాన్ హైకోర్టుకు చేరింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఈ ఏడాది ఏప్రల్ 13న సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది.
కాయిన్స్‌తో కోట్ల మోసం, స్టేట్ బ్యాంక్‌లో భారీ స్కామ్, రంగంలోకి సీబీఐ
భారతీయ స్టేట్ బ్యాంక్‌లో నాణేలు మాయమైన వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. వేర్వేరు రాష్ట్రాల్లో 25 చోట్ల సోదాలు జరిపింది.
కాయిన్స్‌తో కోట్ల మోసం, స్టేట్ బ్యాంక్‌లో భారీ స్కామ్, రంగంలోకి సీబీఐ
ఇప్పటివరకు లభించిన ఆధారాలను ఆసరాగా చేసుకుని గురువారం ఒక్కసారిగా మెరుపు దాడులు చేపట్టింది సీబీఐ. దిల్లీ, జైపుర్, దౌసా, కరౌరీ, సవాయ్ మాధోపుర్, ఆళ్వార్, ఉదయ్‌పుర్, భీల్వాడాలో స్టేట్ బ్యాంక్ మాజీ అధికారులు, మరికొందరికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపింది.
Last Updated : Aug 18, 2022, 6:26 PM IST