తెలంగాణ

telangana

ETV Bharat / business

SBI నుంచి కొత్త క్రెడిట్‌ కార్డ్‌- ప్రతి ట్రాన్సాక్షన్‌ పైనా క్యాష్‌బ్యాక్! ఇంకా ఎన్నో! - SBI Cashback Credit Card benefits

SBI Cashback Credit Card : మీరు తరచూ ఆన్‌లైన్ షాపింగ్స్ చేస్తుంటారా ? ఎక్కువగా చెల్లింపులను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తారా ? అయితే ఈ కథనం మీ కోసమే! ప్రతీ ట్రాన్సా‌క్షన్‌పై క్యాష్‌బ్యాక్‌లు, రివార్డులను.. కస్టమర్లకు అందించడానికి ఎస్‌బీఐ కొత్త క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఇంతకీ ఆ కార్డు ఏంటి..? ఈ కార్డును పొందడానికి ఎవరు అర్హులు ? ఎటువంటి క్యాష్‌బ్యాక్‌లు వస్తాయి ? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

SBI Cashback Credit Card
SBI Cashback Credit Card

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 11:51 AM IST

SBI Cashback Credit Card : ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ వినియోగం పెరిగిపోయింది. మంచి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, రివార్డులను బ్యాంకులు, సంస్థలు అందించడంతో వీటిని వాడే వారి సంఖ్య రోజురోజుకు రెట్టింపవుతోంది. తాజాగా ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ.. క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం ఒక కొత్త క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. అదే ఎస్​బీఐ క్యాష్​బ్యాక్​ క్రెడిట్​ కార్డు(SBI Cashback Credit Card). ఈ కార్డును ఉపయోగించడం వల్ల మంచి క్యాష్‌బ్యాక్, రివార్డులను పొందవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్‌ కార్డును పొందడానికి ఎవరు అర్హులు ? ఈ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎస్‌బీఐ క్యాష్‌ బ్యాక్ క్రెడిట్ కార్డు పేరుకు తగ్గట్టే మంచి క్యాష్‌బ్యాక్‌లను కస్టమర్లకు అందిస్తోంది. ఈ కార్డు ద్వారా చేసే ప్రతి ట్రాన్సా‌క్షన్‌కు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఎస్‌బీఐ కార్డు వార్షిక ఫీజు రూ. 999గా ఉంది. కానీ, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను పొందాలంటే అంతకుముందు సంవత్సరంలో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దాదాపు అన్ని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ కొనుగోళ్లపైనా 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను ఎస్‌బీఐ కార్డ్ ఆఫర్ చేస్తోంది. మీరు పొందిన క్యాష్‌బ్యాక్ నేరుగా అకౌంట్‌లోకి చేరుతుంది.

బ్యాంకు లోన్​ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి!

అర్హతలు :

  • ఈ ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్‌ క్రెడిట్ కార్డును పొందడానికి వయస్సు 21 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
  • కార్డును తీసుకునే వ్యక్తికి స్థిరమైన ఆదాయం ఉండాలి. దీనితో పాటు మంచి క్రెడిట్ హిస్టరీ కూడా ఉండాలి.
  • ఎన్‌రోల్‌మెంట్ ఫీజు రూ. 999లు, ప్లస్ అప్లికేబుల్ టాక్సెస్.
  • వార్షిక ఫీజు రూ. 999 ప్లస్ జీఎస్టీ (ఇది సంవత్సరానికి దాదాపుగా రూ. 1180 ఉంటుంది) ఇది రెండో సంవత్సరం నుంచి వర్తిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది.

ఎన్నో రివార్డులు, బెనిఫిట్స్ :ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ కార్డును ఉపయోగించడం వల్ల ఇంకా ఎన్నో క్యాష్‌బ్యాక్‌లు, రివార్డులను పొందవచ్చు.

  • ఈ కార్డులో ఫ్యూయెల్ సర్‌ఛార్జ్ వేవర్ ఉంది. రూ. 500 నుంచి రూ. 3000 మధ్య చేసే ట్రాన్సాక్షన్లపై ఒక శాతం ఫ్యూయెల్ సర్‌ఛార్జ్ వస్తుంది. గరిష్ఠంగా ఒక స్టేట్‌మెంట్ సైకిల్‌కు రూ. 100 ఉంది.
  • ఫ్లిప్‌కార్ట్, అమెజాన్వంటి ఇ-కామర్స్ సైట్లలో కూడా ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొనుగోళ్లు చేయవచ్చు. ప్రతి ట్రాన్సాక్షన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • ఇక ప్రతి నెలా బిల్లింగ్ స్టేట్‌మెంట్‌కు గరిష్ఠంగా రూ. 5 వేల వరకు లిమిట్ ఉంటుంది. ఎలాంటి పరిమితులు లేకుండా ఆఫ్‌లైన్ స్పెండింగులపై ఒక శాతం క్యాష్‌బ్యాక్ కస్టమర్లకు వస్తుంది.
  • రెంట్ పేమెంట్లు, వాలెట్ రీలోడ్స్, మర్చంట్ ఈఎంఐలు, జ్యువెలరీ కొనుగోళ్లు, స్కూల్/ఎడ్యుకేషన్ ఫీజులు, యుటిలిటీ/ఇన్సూరెన్స్ పేమెంట్లు, గిఫ్ట్ కార్డులు/వోచర్లు, ట్రైన్ టికెట్లు వంటి వాటిపై క్యాష్‌బ్యాక్ వర్తించదు. ఇది గుర్తుంచుకోవాలి.
  • నెలకు రూ. 5000 క్యాష్‌బ్యాక్ దాటిన తర్వాత చేసిన కొనుగోళ్లపై ఆ నెలలో క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్ రావు. కార్డుపై లాంజ్ యాక్సెస్ లేదు.

క్రెడిట్ స్కోర్​ తగ్గిందా? ఈ సింపుల్​ టిప్స్​తో పెంచుకోండిలా!

ఎక్కువ క్రెడిట్​ కార్డులు ఉన్నాయా? స్కోరుపై ప్రభావం పడుతుందా? ఇలా చేయకూడదట!

ABOUT THE AUTHOR

...view details