How to Make Cardless Payments: దేశీయ అతి పెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన కస్టమర్ల కోసం కొత్త సర్వీసులు ఆవిష్కరించింది. 'ఎస్‌బీఐ కార్డ్ పే' పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఎక్కడికి వెళ్లినా షాపింగ్ చేసే సమయంలో కార్డు స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. పిన్ నంబర్ కూడా అవసరం లేదు. నేరుగా మొబైల్ ద్వారా షాపింగ్ బిల్స్ పే చేయవచ్చు. 'SBI Card Pay’ పేరుతో కాంటాక్ట్ లెస్ పేమెంట్ ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీ మొబైల్ ఫోన్లతో.. పాయింట్ ఆఫ్ సేల్స్ (PoS) మిషన్ల దగ్గర కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు.
డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై Wi-Fi సింబల్ ఉన్న కార్డులను కాంటాక్ట్ లెస్ కార్డులు అంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్డులతో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) ఎనేబుల్ అయిన పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్స్ దగ్గర క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో ఇప్పటి వరకూ పేమెంట్ చేస్తున్నారు. ఇక నుంచి ఆ కార్డులతో అవసరం లేకుండా.. మొబైల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ కొత్త సేవతో.. చెల్లింపులు వేగంగా, సురక్షితంగా నిర్వహించడంతోపాటు ఒక్క రోజులో 25వేల రూపాయల వరకూ పేమెంట్ చేయవచ్చు. అయితే.. ఒక్కో లావాదేవీకి మాత్రం రూ. 5000 వరకు మించకూడదు.
How to Setup and Login to SBI YONO App : మీరు ఎస్‌బీఐ కస్టమరా..? మరి YONO యాప్ వాడుతున్నారా.. లేదా??
ఎన్ఎఫ్సీ అంటే ఏమిటి?:
What is NFC :నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(Near Field Communication) అనేది రేడియో తరంగాలను ఉపయోగించి డేటాను వైర్‌లెస్‌గా ప్రసారం చేసే పద్ధతి. చెల్లింపు కోసం ట్యాప్ చేసినప్పుడు.. NFC రీడర్‌లతో చెల్లింపు టెర్మినల్‌లకు చెల్లింపు డేటాను వైర్‌లెస్‌గా ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుంది. చెల్లింపు సమాచారం ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ప్రసారం చేయబడి లావాదేవీని పూర్తిగా సురక్షితం చేస్తుంది. అయితే.. ఈ సేవలను పొందడానికి, SBI కార్డు దారులు ముందుగా నమోదు చేసుకోవాలి. ఈ సేవ కోసం నమోదు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
SBI కార్డ్ పే కోసం ఎలా నమోదు చేసుకోవాలి?
How to Register For SBI Card Pay :
- గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'SBI card' యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
- SBI కార్డ్ యాప్‌కి లాగిన్ చేసి, స్క్రీన్ దిగువన ఉన్న ‘SBI కార్డ్ పే’ గుర్తుపై క్లిక్ చేయండి
- మీరు రిజిస్టర్ చేయాలనుకుంటున్న SBI కార్డ్‌ని ఎంచుకోండి
- SBI కార్డ్ టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను అంగీకరించి.. లింక్ కార్డ్ బటన్ మీద క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిన తర్వాత మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.