SBI Card Festive Offers 2023 In Telugu : ఎస్బీఐ కార్డ్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎస్బీఐ కార్డ్ దసరా పండుగ సందర్భంగా తమ వినియోగదారుల కోసం ఫెస్టివ్ ఆఫర్లను ప్రకటించింది. మేజర్ సిటీలతో సహా టైర్ 2, టైర్ 3 నగరాల్లోనూ ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఎస్బీఐ కార్డ్ ఉపయోగించి చేసే కొనుగోళ్లుపై దాదాపు 2200 రకాల ఆఫర్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా వీటిలో మర్చంట్ ఫండెడ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయని పేర్కొంది.
బంపర్ ఆఫర్స్
SBI Card Unveils Festive Offer 2023 With Cashbacks : మొబైల్స్, ల్యాప్టాప్స్, ఫ్యాషన్, ఫర్నీచర్, జ్యువెలరీ, గ్రోసరీస్ సహా వివిధ రకాల కేటగిరీ వస్తువులపై ఎస్బీఐ కార్డ్ ఆఫర్స్ అప్లై అవుతాయి. అంతేకాదు ఎస్బీఐ కార్డ్ తమ వినియోగాదారుల కోసం ప్రత్యేకం ఈఎంఐ ఫెసిలిటీని, ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తోంది.
లోకల్-టు-నేషనల్
ఎస్బీఐ కార్డ్ ఈ పండుగ సీజన్లో.. 600 నేషనల్ లెవల్ ఆఫర్స్, 1500 రీజినల్ & హైపర్ లోకల్ ఆఫర్స్అం దిస్తోంది. అయితే ఈ ఆఫర్స్ అన్నీ 2023 నంబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్!
SBI Card Discounts And Cashbacks : దేశంలోని 2700 సిటీల్లో ఎస్బీఐ కార్డ్ ఫెస్టివ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, రిలయన్స్ రిటైల్ గ్రూప్, వెస్ట్‌సైడ్, పాంటలూన్స్, మ్యాక్స్, తనిష్క్, టీబీజెడ్ లాంటి పలు ఈ-కామర్స్ వెబ్‌సైట్స్, రిటైల్ స్టోర్స్‌లో ఎస్బీఐ కార్డ్ వినియోగించి కొనుగోలు చేస్తే 27.5% వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. మరికొన్ని ప్రొడక్టులపై ఏకంగా రూ.10,000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈఎంఐ ఫెసిలిటీ!
SBI Card EMI Offer 2023 : ఎస్బీఐ కార్డ్.. కన్జూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్ కొనుగోళ్లపై కూడా ఈఎంఐ ఫెసిలిటీని కల్పిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్, ఎల్జీ, సోనీ, ఒప్పో, వివో, పానాసోనిక్, వర్ల్‌పూల్, బాష్, హెచ్‌పీ, డెల్ లాంటి టాప్ బ్రాండ్ ప్రొడక్టులపై ఈఎంఐ సౌకర్యం అందిస్తోంది.